Atishi Marlena: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అతిశీ.. మంత్రులుగా ఎవరెవరు ప్రమాణం చేశారంటే?
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

Delhi CM Atishi
ఢిల్లీలో అతిశీ (43) ప్రభుత్వం కొలువుదీరింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీ అతిశీని శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్‌లో ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు.
సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్ కొత్త ప్రభుత్వంలో తమ మంత్రి పదవులను నిలుపుకుని మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇమ్రాన్ హుస్సేన్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుల్తాన్‌పూర్ మజ్రా శాసనసభ్యుడు ముకేశ్ అహ్లావత్ మంత్రివర్గంలోకి కొత్తగా వచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
కాగా, ఇంతకు ముందు కొత్త ముఖ్యమంత్రి, మరో ఐదుగురు మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నెల 17న ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతిశీ నిలిచారు. ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రి అతిశీ. గతంలో ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రులుగా సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్ పనిచేశారు.
KTR: రేవంత్ రెడ్డి బావమరిదికి ఆ పనులు అప్పజెప్పారు: కేటీఆర్ సంచలన కామెంట్స్