తీహార్ జైలుకి చిదంబరం

INXమీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సీబీఐ ప్రత్యేక కోర్టు. దీంతో తీహార్ జైలుకు చిదంబరంను తరలించారు. సెప్టెంబర్ 19,2019 వరకూ ఆయనను తీహార్ జైలులో ఉంచుతారు. మొత్తం 14 రోజులు ఆయన జైలులో గడుపుతారు. తీహార్ జైలులో ప్రత్యేక గది,భద్రత కల్పించాలని చిదంబరం కోరడంతో కోర్టు దానికి అంగీకరించింది.
చిదంబరం కుమారుడు కార్తి గతంలో ఉన్న జైలు నెంబర్ ఏడుకు చిదంబరాన్ని తరలిస్తున్నారు. ఈడీ కస్టడీకి అప్పగించాలన్న చిదంబరం పిటిషన్ పై వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీకి నోటీసు పంపింది. సెప్టెంబర్ 12న ఈ పిటిషన్ పై విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.