122 BN CRPF లో కాల్పులు : ఇన్స్ పెక్టర్ ను కాల్చిన SI., ఆపై ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : July 25, 2020 / 01:07 PM IST
122 BN CRPF లో కాల్పులు : ఇన్స్ పెక్టర్ ను కాల్చిన SI., ఆపై ఆత్మహత్య

Updated On : July 25, 2020 / 1:53 PM IST

దేశ రాజధాని ఢిల్లీలోని 122 BN CRPF కాల్పుల కలకలం రేగింది. ఇన్స్ పెక్టర్ దశరథ్ సింగ్ (56) ను ఎస్ఐ కర్నేల్ సింగ్ (55) కాల్చి చంపాడు. అనంతరం కర్నేల్ ఆత్మహత్య చేసుకోవడం ప్రకంపనలు రేకేత్తించింది.

లోధి ఎస్టేట్ లోని హోం మంత్రి భవనం వద్ద 2020, జులై 24వ తేదీ శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు పోలీసు ఉన్నతాధికారులు.

శుక్రవారం రాత్రి దశరథ్ సింగ్, కర్నేల్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. కానీ ఏ విషయంలో జరిగిందో తెలియడం లేదు. ఆగ్రహంతో ఉన్న ఎస్ఐ తన సర్వీస్ గన్ తో ఇన్స్ పెక్టర్ దశరథ్ సింగ్ పై కాల్పులు జరిపాడు.

దశరథ్ అక్కడికక్కడనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే గన్ తో ఎస్ఐ కర్నేల్ సింగ్ తనకు తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.