Delhi Corona Cases : ఢిల్లీలో 14వేల కోవిడ్ కేసులు!.. ప్రస్తుతానికి లాక్ డౌన్ అవసరం లేదు – జైన్

ఢిల్లీలో గురువారం 14,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దేశ రాజధానిలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

Delhi Corona Cases : ఢిల్లీలో 14వేల కోవిడ్ కేసులు!.. ప్రస్తుతానికి లాక్ డౌన్ అవసరం లేదు – జైన్

Delhi Corona Cases

Updated On : January 6, 2022 / 5:52 PM IST

Delhi Corona Cases : ఢిల్లీలో గురువారం 14,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దేశ రాజధానిలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీ పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అవసరం లేదని అన్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు COVID-19 పరీక్షలు చేయించుకుంటున్నందున ఢిల్లీలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని జైన్ చెప్పారు. పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేస్తున్నాం.

చదవండి : Delhi Fire : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 58 షాపులు దగ్ధం!

పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయకపోతే.. కొత్త కేసులు 500-1,000 వరకు తగ్గుతాయి. చాలా రాష్ట్రాలు సరిగా పరీక్షలు నిర్వహించకుండా తక్కువ కేసులు చూపిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు జైన్. దేశంలోనే ఢిల్లీ గరిష్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జైన్. ఢిల్లీలో కొంత మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. అది అది ఆందోళన చెందాల్సినంత సంఖ్య కాదని తెలిపారు. AAP ప్రభుత్వం నగరంలో లాక్‌డౌన్‌ను పరిశీలిస్తోందా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు, జైన్ సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకుందని, రాత్రి కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ విధించడంతోపాటు, సమూహాలుగా ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

చదవండి : Delhi’s Covid Cases : ఢిల్లీలో కోవిడ్ విజృంభణ..94శాతం పెరిగిన కొత్త కేసులు

అయితే బుధవారం, జాతీయ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది, మంగళవారం 5,481 కాగా బుధవారం 10,655 కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 11.88 శాతానికి పెరిగింది. మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఇక ఈ రోజు 14,000 పైచిలుకు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని జైన్ తెలిపారు. ఇక కరోనా తీవ్రత పెరుగుతుండటంతో వైద్యశాఖ సిబ్బందిని ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసులు వేగంగా విస్తరిస్తున్నందున ఇది ఢిల్లీలో కోవిడ్-19 ఐదవ వేవ్ అని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

చదవండి : Delhi Weekend Curfew : ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ.. సమయాలివే..!