Lt Governor VK Saxena : కేజ్రీవాల్ అధికార నివాసం పునరద్ధరణ ఖర్చుపై దర్యాప్తుకు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం

బిల్డింగ్ నిర్వాహణకు బాధ్యత వహించే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ పునరుద్ధరణ పనులు చేసిందని పేర్కొన్నారు. ఇందులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను ఆప్ నేతలు ఖండించారు.

Lt Governor VK Saxena : కేజ్రీవాల్ అధికార నివాసం పునరద్ధరణ ఖర్చుపై దర్యాప్తుకు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం

Lt Governor VK Saxena

Updated On : April 29, 2023 / 6:06 PM IST

Lt Governor VK Saxena : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం పునరద్ధరణ కోసం చేసిన రూ.44.78 కోట్ల ఖర్చుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దృష్టిసారించారు. దానికి సంబంధించిన ఫైళ్లు, రికార్డులను పరిశీలించి 15 రోజుల్లో నివేధిక పంపాలని చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ను ఆదేశించారు. సివిల్ లైన్స్ లోని సీఎం అధికార నివాసం సుందరీకరణకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగినట్లు మీడియాలో ఆరోపణలు వచ్చినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం పేర్కొంది.

ఈ నేపథ్యంలో సంబంధిత అన్ని రికార్డులను భద్రపరచాలని, నిబంధనల ఉల్లంఘనలను పరిశీలించి 15 రోజుల్లో నివేదిక పంపాలని ప్రధాన కార్యదర్శికి ఏప్రిల్ 27న లేఖ రాసింది. కాగా, కేంద్ర ప్రభుత్వంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల క్రితం నిర్మించిన సీఎం అధికార నివాసంలో ఇప్పటికే మూడుసార్లు పైకప్పు కూలిన సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు.

Wrestlers: రెజ్లర్ల వద్దకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేంద్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు

బిల్డింగ్ నిర్వాహణకు బాధ్యత వహించే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ పునరుద్ధరణ పనులు చేసిందని పేర్కొన్నారు. ఇందులో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను ఆప్ నేతలు ఖండించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నివాసానికి మరమ్మతు కోసం రూ.15 కోట్లు ఖర్చు కాగా, ప్రధాని మోదీ అధికార నివాసం కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.