Wrestlers: రెజ్లర్ల వద్దకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేంద్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు

Wrestlers: రెజ్లర్లకు తాను మద్దతుగా ఉంటానని కేజ్రీవాల్ అన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కాపాడుతున్నారని విమర్శించారు.

Wrestlers: రెజ్లర్ల వద్దకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేంద్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు

Wrestlers

Wrestlers: ఢిల్లీలో రెజ్లర్ల నిరసనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మద్దతు తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ లో భారత టాప్ రెజ్లర్లు ఆందోళన తెలుపుతున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని, ఆయనను అరెస్ట్ చేసేంతవరకు ఆందోళన విరమించబోమని రెజ్లర్లు స్పష్టం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు జోక్యంతో నిన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ పై 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. రెజ్లర్లకు మద్దతు తెలిపి కేజ్రీవాల్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రెజ్లర్ల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. మోదీ ఎందుకు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కాపాడుతున్నారని కేజ్రీవాల్ నిలదీశారు. దేశాన్ని ప్రేమించే వారు పార్టీలకు అతీతంగా రెజ్లర్ల ధర్నాకు మద్దతు ఇవ్వాలని అన్నారు.

రెజ్లర్లు దేశం కోసం ఆడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ రెజ్లర్ల పట్ల నిర్దయగా ఉండొద్దని కేజ్రీవాల్ చెప్పారు. వారికి విద్యుత్, నీరు నిలిపివేయడం అమానవీయమని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెజ్లర్లకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. రెజ్లర్లు పోరాడి గెలవాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, రెజ్లర్లకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు రెజ్లర్లకు మద్దతు తెలిపారు.

Wrestlers Protest: నేను నేరస్థుడిని కాదు.. రాజీనామా చేయను.. ఎఫ్ఐఆర్‌‌లు నమోదుపై స్పందించిన బ్రిజ్ భూషణ్ సింగ్