Delhi: అయ్యోపాపం.. నిద్రిస్తున్న యువకుడిని దారుణంగా కొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్
వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బైక్ పై రోడ్డు పక్కన నిద్రిస్తున్న యువకుడి వద్దకు వచ్చారు..

incident took place in North West Delhi Model Town
Sleeping labourer attacked with stick in delhi : ఉత్తర ఢిల్లీలోని మోడల్ టౌన్ లో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్యన్ అనే వ్యక్తి రోడ్డుపక్కన నిద్రిస్తున్న రాంఫాల్ అనే యువకుడిపై దాడి చేశాడు. కర్రతో బలంగా కొట్టాడు. బహిరంగ మూత్ర విసర్జన చేయొద్దని చెప్పినందుకు ఈ దాడికి పాల్పడ్డాడు.
Also Read : IND vs BAN First T20: సుందర్, రింకూ బ్యాటింగ్ చేస్తుండగా సూర్య కేకలు వేస్తూ ఏం చేశాడో చూడండి.. వీడియో వైరల్
వీడియోలోని దృశ్యాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బైక్ పై రోడ్డు పక్కన నిద్రిస్తున్న యువకుడి వద్దకు వచ్చారు. బైక్ పైనుంచి ఓ వ్యక్తి దిగివచ్చి పెద్ద కర్రతో నిద్రిస్తున్న యువకుడిని దారుణంగా కొట్టాడు. ఆ సమయంలో చుట్టుపక్కల జనసంచారం కూడా లేరు. దీంతో యువకుడిపై దారుణంగా దాడి చేస్తున్నా అడ్డుకొనే వారు లేకుండా పోయింది. ఆ తరువాత వచ్చిన బైక్ పై వ్యక్తి వెళ్లిపోయాడు. రాంఫాల్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వ్యక్తిని ఆర్యన్ గా గుర్తించి అరెస్టు చేశారు.
Also Read : Las Vegas airport : బాబోయ్ పెను ప్రమాదం తప్పింది.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రెండు రోజుల క్రితం ఆర్యన్ పార్క్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేస్తుండగా గొడవ మొదలైంది. సమీపంలోని దుకాణంలో పనిచేస్తున్న బాధితుడు రాంఫాల్.. బహిరంగ మూత్ర విసర్జన చేయొద్దని ఆర్యన్ తో ఘర్షణకు దిగాడు. దీంతో రాంఫాల్ పై కక్ష పెంచుకున్న ఆర్యన్.. మరుసటి రోజు తన స్నేహితులతో కలిసి బైక్ పై వచ్చి రోడ్డుపక్కన నిద్రపోతున్న రాంఫాల్ పై విచరక్షణా రహితంగా పెద్దకర్రతో దాడి చేశాడు.
दिल्ली के मॉडल टाउन का LAW & ORDER
एक व्यक्ति आराम से भगवा चादर ओढ़ कर सोया है।
बाइक पर गुंडे आते है और डंडो से मारना शुरू कर देते है।@CPDelhi @DCP_NorthWest @LtGovDelhi pic.twitter.com/EiQAakBZuA— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) October 5, 2024