Las Vegas airport : బాబోయ్ పెను ప్రమాదం తప్పింది.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్

కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ కు ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానం వెళ్తుంది. అయితే, విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ..

Las Vegas airport : బాబోయ్ పెను ప్రమాదం తప్పింది.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్

Frontier Airlines jet

Updated On : October 6, 2024 / 11:29 AM IST

Frontier Airlines jet catches on fire : ఘోర ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దట్టమైన పొగలు కమ్ముకోవటంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదపు చేశారు. విమానాశ్రయం సిబ్బంది, ఫైర్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో మొత్తం 190మంది ప్రయాణికులు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Israel and Hamas war: గాజాలో మసీదు, పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు.. 24 మంది పాలస్తీనియన్లు మృతి

కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ కు ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ విమానం వెళ్తుంది. అయితే, విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. చూస్తుండగానే మంటలు పెద్దవి అవుతున్న క్రమంలో విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.. ఫైరిజన్లు వేగంగా విమానం వద్దకు తీసుకెళ్లి మంటలను అదుపు చేశారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానంలో నుంచి కిందికి తీసుకొచ్చి బస్సులో టెర్మినల్ కు తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులతోపాటు విమానాశ్రయ ఉన్నతాధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలాఉంటే.. విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగడంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) విచారణ చేపట్టింది.