Lockdown రూల్స్ ఉల్లంఘిస్తున్నాడంటూ తండ్రిపైనే కేసు

ఢిల్లీలోని ఓ వ్యక్తి తన తండ్రిపైనే కేసు నమోదు చేశాడు. ప్రతి ఉదయం లాక్‌డౌన్ ఆర్డర్లేమీ పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 59ఏళ్ల తన తండ్రికి కరోనా గురించి ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదని.. ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి పెరిగిపోతుండటంతో దేశమంతా లాక్ డౌన్ ప్రకటించింది ప్రభుత్వం. ఫలితంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. సామాజిక దూరంతో కరోనా మూడో దశకు చేరకుండా అడ్డుకోగలిగారు.
ఈ సమయంలో రూల్స్ ఉల్లంఘించి తిరుగుతున్నందుకు కొడుకు ఫిర్యాదు ఆధారంగా తండ్రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే భారత్ లో మొత్తం కరోనా కేసులు 2వేల 500కాగా, ఒక్క ఢిల్లీలోనే 290 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన జమాత్ కారణంగా మరిన్ని కేసులు ఎక్కువయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ 50వేల మందికి సోకింది. మిలియన్ మంది ప్రజలకు టెస్టులు చేయించుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం కంటే దారుణమైన సంక్షోభంలో పడేసింది కరోనా. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో కొవిడ్-19, న్యూ కరోనా వైరస్ కలయిక చాలా ప్రమాదకరమైనదని హెచ్చరించారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు ఇచ్చారు. ఇటువంటి ఘటనలు గతంలో చూడని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read | వైఎస్ఆర్ నాటి చట్టాన్ని మళ్లీ తీసుకురావాలి