Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికకు లైన్ క్లియర్.. 22న నిర్వహించేందుకు ఎల్జీ అంగీకారం

సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నెల 22న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి సమావేశం జరుగుతుంది. అదే రోజు ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు స్టాండింగ్ కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ విషయంలో ఆప్, బీజేపీ మధ్య బేధాభిప్రాయాలున్నాయి.

Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికకు లైన్ క్లియర్.. 22న నిర్వహించేందుకు ఎల్జీ అంగీకారం

Updated On : February 18, 2023 / 6:15 PM IST

Delhi Mayor Election: ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఢిల్లీ మేయర్ ఎన్నిక తిరిగి నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అంగీకరించారు. సీఎం కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదముద్ర వేశారు. ఈ నెల 22న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి సమావేశం జరుగుతుంది.

Harish Rao: తెలంగాణ దశ దిశ మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్: మంత్రి హరీష్ రావు

అదే రోజు ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్‌తోపాటు స్టాండింగ్ కమిటీకి చెందిన ఆరుగురు సభ్యులను కూడా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ విషయంలో ఆప్, బీజేపీ మధ్య బేధాభిప్రాయాలున్నాయి. దీంతో మేయర్‌ను ఎన్నుకునేందుకు ఓటింగ్ నిర్వహించినప్పటికీ, ఈ ప్రక్రియ సాగలేదు. దీంతో మూడుసార్లు మేయర్ ఎన్నిక వాయిదాపడింది. ఢిల్లీ మేయర్ ఎన్నికపై శుక్రవారం సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మేయర్ ఎన్నిక విషయంలో ఆప్ తరఫున మేయర్ అభ్యర్థి అయిన షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

IndiGo’s expansion: భారీ విస్తరణకు ఇండిగో ప్లాన్.. 500 విమానాలు కొనుగోలు చేయనున్న సంస్థ

దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. దీంతో ఆయన మేయర్ ఎన్నికకు 24 గంటల్లోగా నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. దేశ రాజధానిలో మేయర్ లేకపోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మేయర్ పదవి కోసం నామినేటెడ్ అభ్యర్థులు ఓటు వేయరాదని ఆదేశించారు. మేయర్ ఎన్నిక పూర్తైన తర్వాత మేయర్‌గా ఎన్నికైన వాళ్లే డిప్యూటీ మేయర్, ఇతర సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘ఇది ప్రజాస్వామిక విజయం’ అని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఈ నెల 22, బుధవారం జరగనుంది.