ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్

దేశ రాజదాని ఢిల్లీకి కొత్త పోలీసు బాస్ వచ్చాడు. ప్రస్తుతం ఉన్న కమిషనర్ అమూల్య పట్నాయక్ పదవీకాలం 2020, ఫిబ్రవరి 29వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త కమిషనర్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసు కమిషనర్‌గా ఎస్. ఎస్. శ్రీవాస్తవను కేంద్ర హోం శాఖ నియమించింది. ఈయన ప్రస్తుతం ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2020, మార్చి 01వ తేదీన ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇక శ్రీవాస్తవ విషయానికి వస్తే..1985 బ్యాచ్‌కు చెందిన వారు. అరుణచాల్ ప్రదేశ్, గోవా, మిజోరాం కేడర్ అధికారిగా పనిచేశారు. CRPF నుంచి ఢిల్లీ పోలీసు విభాగంలోకి తీసుచ్చింది. స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పోస్టింగ్ ఇచ్చింది. ఢిల్లీలో స్పెషల్ సెల్‌తో పాటు ఇతర విభాగాలకు సేవలందించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థపై దర్యాప్తులో శ్రీవాస్తవ కీలక పాత్ర పోషించారు. ట్రాఫిక్ విభాగంలో కూడా ఆయన పని చేశారు.
ఢిల్లీలో మూడు రోజుల్లో పాటు జరిగిన అల్లర్లలో 38మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. అల్లర్లలో చనిపోయిన బాధిత కుటుంబాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ..కేంద్ర హోం మంత్రి అమీత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
నిఘా వైఫల్యం ఉందంటూ..కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశాయి. ఘర్షణలకు కేంద్రం, ఆమ్ ఆద్మీ రెండూ కారణమని ఆరోపించింది. దీంతో ఢిల్లీ అల్లర్లపై బ్లేమ్‌గేమ్ తారాస్థాయికి చేరింది. బీజేపీ లీడర్లపైనా, అల్లర్లు జరుగుతుంటే చోద్యం చూసిన పోలీసులపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు జస్టిస్ ట్రాన్స్ ఫర్ అవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read | ఒకేరోజు ఢిల్లీ హైకోర్టు 2 తీర్పులు.. జడ్జిని బట్టే న్యాయం మారుతుందా