ఢిల్లీ ఫ్యాక్టరీలో పేలుడు : కుప్పకూలిన భవనం..శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 05:25 AM IST
ఢిల్లీ ఫ్యాక్టరీలో పేలుడు : కుప్పకూలిన భవనం..శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులు

Updated On : January 2, 2020 / 5:25 AM IST

ఢిల్లీలోని పీరాగర్హీలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం (జనవరి 2) తెల్లవారుఝామున 4.23 గంటలకు  తెల్లగరిలోని ఉదోగ్ నగర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన 35 ఫైర్ ఇంజన్లతో సహా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో మంటలకు అదుపు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

దీంతో ఫ్యాక్టరీ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. కాగా ప్రమాదంతో పొగ దట్టంగా అలుముకోవటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.  కాగా ఢిల్లీలో ఇటీవల కర్మాగారాల్లో పలు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. దీంతో  ఆయా ప్రాంతాల్లోని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.