ఢిల్లీలో ఘర్షణలు : కేజ్రీ సర్కార్ ఎక్స్‌‌గ్రేషియా..వివరాలు

  • Published By: madhu ,Published On : February 27, 2020 / 01:18 PM IST
ఢిల్లీలో ఘర్షణలు : కేజ్రీ సర్కార్ ఎక్స్‌‌గ్రేషియా..వివరాలు

Updated On : February 27, 2020 / 1:18 PM IST

దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. చాలా మంది గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిహారం ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం సాయంత్రం మీడియాకు వివరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఖర్చులు సైతం ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బాధిత కుటుంబాలకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 

* అల్లర్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు. 
* తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు. 
* శాశ్వత వైకల్యం కలిగితే రూ. 5 లక్షలు. 
* అద్దెకు ఉండే వాళ్లకు రూ. 1 లక్ష చొప్పున సహాయం చేస్తామన్నారు. 

* పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి రూ. 5 వేలు. 
* రిక్షాలు ధ్వంసమైతే వాటి యజమానులకు రూ. 25 వేలు.
* ఈ రిక్షాలు ధ్వంసమైతే..రూ. 50 వేలు. 
* అనాథలుగా మిగిలిన వారికి రూ. 3 లక్షలు. 

* ఇల్లు పూర్తిగా కాలిపోతే (యజమానికి) రూ. 4 లక్షలు.
* అద్దెకు ఉంటున్న వారికి రూ. లక్ష. 
* షాపు ధ్వంసమైతే రూ. 5 లక్షలు. 
* త్వరలో ఆప్ డెవలప్ మెంట్. 
 

* ధృవపత్రాలు కాలిపోతే..రెవెన్యూ శాఖ స్పెషల్ శిబిరాలు ఏర్పాటు.
* క్యాంపులు ఏర్పాటు చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు సూచనలు. 
* కాలిపోయిన బుక్స్, స్కూల్ యూనిఫాం (ప్రైవేటు, ప్రభుత్వం) ఇవ్వాలని నిర్ణయం. 

Read More : Delhi Protest : AAP లీడర్లకు డబుల్ శిక్ష వేయండి – కేజ్రీ