Delhi: ఢిల్లీలో నమోదైన కేసులు 89 మాత్రమే

అత్యల్ప సంఖ్యలో నమోదైన కరోనా కేసులు.. ఢిల్లీకి ఊరట కలిగించాయి. 2021 సంవత్సరంలోనే అత్యంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

Delhi: ఢిల్లీలో నమోదైన కేసులు 89 మాత్రమే

Delhi Records 89 New Covid 19 Cases

Updated On : June 21, 2021 / 6:01 PM IST

Delhi: అత్యల్ప సంఖ్యలో నమోదైన కరోనా కేసులు.. ఢిల్లీకి ఊరట కలిగించాయి. 2021 సంవత్సరంలోనే అత్యంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. గడిచిన 24గంటల్లో 89కేసులు మాత్రమే నమోదు కావడం హర్షించదగ్గ విషయం. అంతేకాకుండా కొవిడ్ పాజిటివిటీ రేటు కూడా 0.16శాతానికి పడిపోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ లేనంత తక్కువ సంఖ్యలో నమోదవుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం వెయ్యి 996మంది కొవిడ్ పేషెంట్లు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 563మాత్రం హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మార్చి 10న నమోదైన 1900 యాక్టివ్ కేసుల తర్వాత మళ్లీ అంత తక్కువ సంఖ్యలో నమోదైంది సోమవారమే.

ఇప్పటి వరకూ ఢిల్లీలో 14లక్షల 32వేల 381 కొవిడ్ కేసులు రికార్డ్ అయ్యాయి. వారిలో 14లక్షల 5వేల 460మంది రికవరీ అయ్యారు. గడిచిన 24గంటల్లో కనీసం 24మంది చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 24వేల 925కు చేరింది.