Delhi Covid Cases : ఢిల్లీలో 24 గంటల్లో వెయ్యిలోపే కొత్త కరోనా కేసులు.. ఈ ఏడాదిలో ఇదే అత్యల్పం!

దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఒక్కో రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.

Delhi Covid Cases : ఢిల్లీలో 24 గంటల్లో వెయ్యిలోపే కొత్త కరోనా కేసులు.. ఈ ఏడాదిలో ఇదే అత్యల్పం!

Delhi Records Less Than 100

Updated On : February 11, 2022 / 8:39 PM IST

Delhi Covid Cases : దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఒక్కో రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఆంక్షలు విధించిన రాష్ట్రాలన్నీ నెమ్మదిగా సడలిస్తున్నాయి. గతనెలలో కరోనా కొత్త కేసులు భారీగా నమోదైన ఢిల్లీలో కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టాయి.

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 1000 కన్నా తక్కువగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 2022 ఏడాదిలో ఇదే అత్యల్పంగా నమోదయ్యాయి. ఢిల్లీలో శుక్రవారం 977 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4,812కు చేరుకుంది. మొత్తంగా 18,49,596గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది.

గడిచిన 24 గంటల్లో 12 మరణాలు నమోదయ్యాయి. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 26047కు చేరుకుంది. ప్రస్తుతం, పాజిటివిటీ రేటు 1.73శాతం, యాక్టివ్ కరోనావైరస్ బాధితుల రేటు 0.26శాతంగా నమోదైంది. 1,591 రికవరీలతో కలిపి మొత్తంగా రికవరీ అయిన వారి సంఖ్య 18,18,737కి పెరిగింది. రికవరీ రేటు 98.33 శాతంగా నమోదైంది.

డిసెంబర్ 30, 2021 నుంచి 24 గంటల్లో నమోదైన అతి తక్కువ కోవిడ్ కేసులు ఇవే.. గత ఏడాది డిసెంబర్ 30న దేశ రాజధాని ఢిల్లీలో 1,313 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. దాదాపు 3135 మంది కోవిడ్ బాధితులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కంటైన్‌మెంట్ జోన్‌ల సంఖ్య 19,582గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 56,444 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 46,664 RT-PCR, 9780 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలను నిర్వహించారు. ఢిల్లీలో మొత్తం కొవిడ్ టెస్టుల సంఖ్య 3,55,18,310కి చేరుకుంది.

Read Also : Lata Mangeshkar: అయోధ్యలో ఒక కూడలికి “లతా మంగేష్కర్” పేరు: యోగికి మోదీ ప్రశంస