ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి సాయం
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కుటుంబసభ్యులకు కోటి

ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కుటుంబసభ్యులకు కోటి
ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కుటుంబసభ్యులకు కోటి రూపాయలతో పాటు, రతన్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే రతన్ లాల్‌కు కేంద్రం అమరవీరుడి హోదా ఇచ్చింది. ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ చనిపోయారు.
రూ.కోటి సాయం, భార్యకు ప్రభుత్వం ఉద్యోగం:
ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో సోమవారం(ఫిబ్రవరి 24,2020) సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న రతన్ లాల్ ఆందోళనకారులు జరిపిన దాడిలో మృతి చెందారు. బుల్లెట్ గాయం వల్లే రతన్ లాల్ చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. రతన్ లాల్‌ను అమరవీరుడిగా ప్రకటించాలంటూ ఆయన కుటుంబసభ్యులు మంగళవారం డిమాండ్ చేశారు. స్పందించిన ప్రభుత్వం రతన్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది. రతన్ కు అమరవీరుడి హోదా ఇవ్వడంతో పాటు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురిలో మూడు రోజులుగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య హింసాకాండలో 27మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆందోళనలు ఉద్రికత్తకు దారి తీశాయి.
దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు:
ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరవీరుడి ఆత్మకు శాంతిని కలగాలని రతన్‌లాల్ భార్యకు లేఖ ద్వారా ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘రతన్‌లాల్ ధైర్యశాలి, కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ధీరుడు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుడు’ అని లేఖలో తెలిపారు. కాగా..ఈ అల్లర్లలో మరో పోలీస్ అధికారి బలయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న అంకిత్ శర్మ(26) అనే పోలీస్ అధికారి అల్లర్లలో తీవ్రంగా గాయపడి మృతిచెందారు. ఇప్పటికే 50 మంది పోలీసులు సహా 260 మంది ఈ ఆందోళనల్లో తీవ్రంగా గాయపడ్డారు. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పడంతో.. పోలీసులు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారు.