“గ్రేట్ మహాత్మగాంధి”కి నివాళులర్పించి..మొక్క నాటిన ట్రంప్ దంపతులు 

  • Published By: veegamteam ,Published On : February 25, 2020 / 05:47 AM IST
“గ్రేట్ మహాత్మగాంధి”కి నివాళులర్పించి..మొక్క నాటిన ట్రంప్ దంపతులు 

Updated On : February 25, 2020 / 5:47 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ రోజు భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించారు. రాజ్ ఘాట్‌లో మహాత్మాగాంధీకి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు.  అనంతరం రాజ్ ఘాటల్ లో ట్రంప్ తన భార్య మెలనియాతో కలిసి ఓ మొక్కను నాటారు. ట్రంప్ కుటుంబం భారత్ ను సందర్శించిన గుర్తుగా మొక్కను నాటటం జరిగింది.

మహాత్మాగాంధీకి నివాళులర్పించిన సందర్భంగా ట్రంప్ దంపతులకు మహాత్ముడి చిత్రపటాన్ని కానుకగా ఇచ్చారు. రాజ్ ఘాట్ ను ఆసక్తిగా గమనించిన ట్రంప్ దంపతులు ఆ పరిసర ప్రాంతాల్లో కలియతిరిగారు. 

రాజ్ ఘాట్ వద్ద సందర్శకుల పుస్తకంలో డొనాల్డ్ ట్రంప్ సందేశం రాస్తూ.. ‘అమెరికన్ ప్రజలు సార్వభౌమ మరియు అద్భుతమైన భారతదేశంతో బలంగా నిలబడతారు – గొప్ప మహాత్మా గాంధీ దృష్టి. ఇది ఎంతో గౌరవం అని రాశారు.