Bride Dance : వావ్.. వాటే డ్యాన్స్.. నవవధువు స్టెప్పులకు నెటిజన్లు ఫిదా
ఇటీవల కాలంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. పెళ్లి మండపంలో వధూవరులు డ్యాన్సులతో ఇరగదీస్తున్నారు. అద్భుతమైన స్టెప్పులతో వావ్ అనిపిస్తున్నారు

Bride Dance
Bride Dance : ఇటీవల కాలంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. పెళ్లి మండపంలో వధూవరులు డ్యాన్సులతో ఇరగదీస్తున్నారు. అద్భుతమైన స్టెప్పులతో వావ్ అనిపిస్తున్నారు. పెళ్లి మండపంలో నవ వధువు లేదా వరుడు చేసే డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రొఫెషనల్ డ్యాన్సర్లను తలపిస్తూ కొందరి చేసే డ్యాన్స్ లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్.. వాటే డ్యాన్స్ అని కితాబిస్తున్నారు.
Power Cut : ఏపీలో రోజూ 4 గంటలు కరెంట్ కట్..? ఇందులో నిజమెంత
తాజాగా ఓ పెళ్లిలో పెళ్లి కూరుతు డ్రెస్ లో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. బాలీవుడ్ చిత్రం జానే తు యా జానే నా(Jaane Tu Ya Jaane Na)లోని ‘పప్పు కాన్ట్ డ్యాన్స్ సాలా’ పాటకి తన స్నేహితులతో కలిసి పెళ్లి కూతురు స్టెప్పులేసింది. ఆ వీడియోను కొరియోగ్రాఫర్ మహిమ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వధువు డ్యాన్స్‌తో పాటు ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్నారు. ఆమె డ్యాన్స్‌కి ఫ్యాన్స్‌గా మారిపోయమని కొందరు, వావ్ వాటే డ్యాన్స్ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. డ్యాన్స్ చేసిన వధువు పేరు కోమల్ కపూర్. ఆ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పేరు మహిమా. సినిమాలోని పాటకు జెనీలియా, ఇమ్రాన్ ఖాన్ డ్యాన్స్ చేశారు.
View this post on Instagram