Ramcharitmanas Remark Row: మౌర్య తల తీసేయాలంటూ అయోధ్య సాధువు సంచలన వ్యాఖ్యలు.. ఉగ్రవాదులంటూ మౌర్య ప్రతిదాడి
నేను తెలిపిన అభిప్రాయంపై కొందరు మత కాంట్రాక్టర్లు (పూజారులు) నా నాలుక, తల నరికే వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అదే రివార్డు మాట ఇంకెవరైనా చెబితే ఈ కాంట్రాక్టర్లే వాళ్లను టెర్రరిస్టు అని పిలిచేవారు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చేసిన సాధువులు, మహంతులు, మత పెద్దలైన ఈ కులతత్వ వ్యక్తులను ఏమని పిలవాలి? టెర్రరిస్టులు అనాలా? భూమి మీద ఉన్న దెయ్యాలు అనాలా?

Devils, executioners: SP's Maurya as seer announces bounty on head
Ramcharitmanas Remark Row: రామచరితమానస్ గ్రంథంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీల మీద చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, వారిని అనుచిత వ్యాఖ్యలతో దూషించారని వ్యాఖ్యానించిన సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై అయోధ్య సాధువు జగద్గురు పరమహంస తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మౌర్య తలను తెచ్చిన వారికి తాను 500 రూపాయల బహుమతి ఇస్తానంటూ పరమహంస ప్రకటించారు. రామచరితమానస్ మీద అనుచితంగా మాట్లాడిన స్వామి ప్రసాద్ మౌర్య మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే హిందూ సమాజానికి మౌర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో మౌర్య తలను ఎవరైనా తీసుకు రావచ్చని, వారిని తాను 500 రూపాయల రివార్డు ఇస్తానని పరమహంస అన్నారు.
#BharatJodoYatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ
తాను చేప్పిన అభిప్రాయాల మీద సాధువులై ఉండి తలలు తీసేయాలని, నాలుకలు కోసేయాలని ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి వారిని ఉగ్రవాదులు అనడంలో తప్పేంటని మౌర్య ప్రశ్నించారు. ఒకవేళ ఇవే వ్యాఖ్యలు ఎవరైనా చేసుంటే వారిని ఉగ్రవాదులని ఈ సాధువులే దూషించేవారని గుర్తు చేశారు. ‘‘తాజాగా నేను తెలిపిన అభిప్రాయంపై కొందరు మత కాంట్రాక్టర్లు (పూజారులు) నా నాలుక, తల నరికే వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ అదే రివార్డు మాట ఇంకెవరైనా చెబితే ఈ కాంట్రాక్టర్లే వాళ్లను టెర్రరిస్టు అని పిలిచేవారు. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చేసిన సాధువులు, మహంతులు, మత పెద్దలైన ఈ కులతత్వ వ్యక్తులను ఏమని పిలవాలి? టెర్రరిస్టులు అనాలా? భూమి మీద ఉన్న దెయ్యాలు అనాలా? హంతకులు అనాలా? ఏమని పిలవాలి వారిని?’’ అని శుక్రవారం మౌర్య అన్నారు.
రామచరితమానస్ గ్రంథంపై స్వామి ప్రసాద్ మౌర్య కొద్ది రోజుల క్రితం స్పందిస్తూ ‘‘కొన్ని కోట్ల మంది ఈ గ్రంథాన్ని చదవలేదు. ఇందులో ఉన్నదంతా తప్పిదమే. వ్యక్తిగత ఆనందం కోసం, ప్రశంసల కోసం తులసీదాస్ ఈ గ్రంథాన్ని రాశారు. ధర్మం అంటే మేం దాన్ని స్వాగతిస్తాం. కానీ ధర్మం పేరు మీద దూషణలేంటి? దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాల మీద దూషణలు ఎందుకు చేశారు? వారికి శూద్రులని పేరు పెట్టి ఎందుకు వారిపై వివక్ష చూపించారు? దూషించడం, వివక్ష చూపించడమే ధర్మమా? అయితే అలాంటి ధర్మం అవసరం లేదు’’ అని అన్నారు.