Kashi Vishwanath Temple : కాశీ విశ్వనాథ ఆలయంలో గొడవ.. దాడి చేసుకున్న భక్తులు, సిబ్బంది

ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో గొడవ జరిగింది. ఆలయ సిబ్బందికి, భక్తులకు మధ్య తోపులాట జరిగింది. ఆలయ గర్భగుడి వద్ద హారతి కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడికి దిగారు.

Kashi Vishwanath Temple : కాశీ విశ్వనాథ ఆలయంలో గొడవ.. దాడి చేసుకున్న భక్తులు, సిబ్బంది

Kashi Vishwanath Temple

Updated On : July 24, 2022 / 7:26 PM IST

Kashi Vishwanath Temple : ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో గొడవ జరిగింది. ఆలయ సిబ్బందికి, భక్తులకు మధ్య తోపులాట జరిగింది. ఆలయ గర్భగుడి వద్ద హారతి కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడికి దిగారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ తోపులాట దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాశీ విశ్వనాథ ఆలయంలో శనివారం సాయంత్రం హారతి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో గర్భుగుడి తలుపులు మూసేశారు. ఇదే సమయంలో కొందరు భక్తులు దర్శనం కోసం పట్టుబట్టారు. భక్తులను ఆలయ సిబ్బంది అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా గొడవకు దారితీసింది.

YS Sharmila Bonam : అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగిన షర్మిల

దీంతో భక్తులు, సిబ్బంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. చివరికి భక్తులను బలవంతంగా గర్భగుడి నుంచి బయటకు పంపేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు.. ఆలయ సిబ్బందిపైన నిర్వాహకులకు లేఖ రాశారు. తమకు పోలీసులు కూడా సహకరించలేదని, తమపైనే దాడికి దిగారని ఆరోపిస్తూ నలుగురు ఆలయ సిబ్బందిపై భక్తులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.