Train Seat : ఇలా కూడా రైలు ఎక్కొచ్చా, సీటు దక్కించుకోవాలనే తొందరలో

రైలులో ప్రతి బోగికి సాధారణ కిటికీతో పాటు ఎమర్జెన్సీ విండో ఉంటందనే సంగతి తెలిసిందే. దీనిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. సీటు దక్కించుకోవాలే తొందరలో ఓ మహిళ ఏకంగా రైలు బోగికి ఉండే అత్యవసర కిటికీలో నుంచి రైలులోకి ప్రవేశించింది.

Train Seat : ఇలా కూడా రైలు ఎక్కొచ్చా, సీటు దక్కించుకోవాలనే తొందరలో

Train

Updated On : July 28, 2021 / 7:40 AM IST

Woman Boarded The Train: బస్సు, రైళ్లలో ఎలా ఎక్కుతాం ? అంటే ఏముంది..డోర్ నుంచి ఎక్కుతాం అని అంటారు కదా. అదే రద్దీగా ఉన్న సమయంలో మాత్రం సీటు దక్కించుకోవాలంటే ఫీట్లు చేయాల్సిందే. కొంతమంది తోసుకుంటూ ఎక్కి..మరీ సీటు సంపాదిస్తుంటారు. సీటు దక్కడంతో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లుగా భావిస్తుంటారు. విద్యార్థులు, యువకులు బస్సులు, రైళ్ల కిటికీల ద్వారా ఎక్కుతూ చూస్తుంటాం. అదే మహిళలు ఎక్కడం ఏమైనా చూశారా ? ఓ మహిళ రైలు కిటికీ ద్వారా ఎక్కింది. రైలు బోగికి ఉండే ఎమర్జెన్సీ కిటికీ ద్వారా రైలులోకి ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More : Tokyo Olympics 2021: వినేశ్ ఫోగట్‌ను టోక్యోకు వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు

రైలులో ప్రతి బోగికి సాధారణ కిటికీతో పాటు ఎమర్జెన్సీ విండో ఉంటందనే సంగతి తెలిసిందే. దీనిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. సీటు దక్కించుకోవాలే తొందరలో ఓ మహిళ ఏకంగా రైలు బోగికి ఉండే అత్యవసర కిటికీలో నుంచి రైలులోకి ప్రవేశించింది. మహిళా అలా ఎక్కుతుండగా వీడియో తీసి ..canada_blike04 ఇన్ స్ట్రా గ్రామ్ ద్వారా పోస్టు చేశారు. ముందుగా చెప్పులు తీసి రైలు లోపల వేసి…ఎక్కేసింది. లోపల ఉన్న ఓ వ్యక్తి సహకరించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రైలు ఇలా ఎక్కుతారా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. 64,057 views సంపాదించింది. మహిళ చేసిన పనికి కొంతమంది నవ్వుతూ కామెంట్స్ చేయగా..మరికొందరు ఇలా చేయవద్దని సూచిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Canada_wale_jatt?? (@canada_blike04)