దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగింది: ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాగల్

  • Published By: veegamteam ,Published On : December 6, 2019 / 09:25 AM IST
దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగింది: ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాగల్

Updated On : December 6, 2019 / 9:25 AM IST

దిశ హత్యాచారం ఘటనలో నిందుతుల్ని ఎన్ కౌంటర్ చేయటాన్ని ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ ని స్వాగతించిన సీఎం భూపేశ్ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందన్నారు. నేరస్థుడు తప్పించుకునే సమయంలో పోలీసులకు ఎన్ కౌంటర్ ఒక్కటే మార్గమనీ తెలంగాణ పోలీసులు అదే చేశారని అన్నారు. 

సెప్టెంబర్ 27న దిశను హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన 10 రోజులకు అంటే డిసెంబర్ 6న దిశ నిందితులు మహ్మద్ అరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ చేయటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ..పోలీసులకు రాఖీలు కట్టారు. డప్పులు వాయిస్తూ యువతులు తమ హర్షాన్ని వ్యక్తంచేశారు.  సామాన్య ప్రజల నుంచే కాక..సెలబ్రిటీలు..ప్రజా ప్రతినిథులు కూడా హర్షం వ్యక్తంచేస్తున్నారు.