Divorce Celebrations: విడాకులు వచ్చాయని భర్త సంబరాలు.. 40 లీటర్ల పాలతో స్నానం.. స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఫుల్ హ్యాపీ..

విడాకులు మంజూరు అయ్యాయని నా న్యాయవాది నాకు తెలియజేశారు. నాకు స్వాతంత్ర్యం వచ్చినట్లుంది. ఈరోజు నుంచి నేను..

Divorce Celebrations: విడాకులు వచ్చాయని భర్త సంబరాలు.. 40 లీటర్ల పాలతో స్నానం.. స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఫుల్ హ్యాపీ..

Updated On : July 13, 2025 / 6:20 PM IST

Divorce Celebrations: లీగల్ గా విడాకులు మంజూరు అయిన తర్వాత ఓ భర్త చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాకు విడాకులు వచ్చాయోచ్ అంటూ అతగాడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. అంతేకాదు సంబరాలు కూడా జరుపుకున్నాడు. ఈ క్రమంలో పాలతో స్నానం చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. విడాకుల తర్వాత ఆ వ్యక్తి చేసిన పని వైరల్ అయ్యింది. అస్సాంలో ఈ ఘటన జరిగింది.

అతడి పేరు మానిక్ అలీ. నలబరి జిల్లాలో నివాసం ఉంటున్నాడు. చట్టపరంగా భార్యతో విడిపోయిన ఆనందంలో అతడు పాలతో స్నానం చేశాడు. నాలుగు బకెట్లలో 40 లీటర్ల పాలు తెచ్చుకున్న అలీ.. వాటితో తన ఇంటి బయటే స్నానం చేశాడు. ఆ విధంగా డివోర్స్ ను సెలబ్రేట్ చేసుకున్నాడతడు. అంతేకాదు.. నాకు స్వాతంత్ర్యం వచ్చింది. నేను ఇవాళ్టి నుంచి ఫ్రీ అయిపోయాను అంటూ కేకలు కూడా వేశాడు. “ఆమె తన ప్రేమికుడితో పారిపోతూనే ఉంది. మా కుటుంబ శాంతి కోసం నేను మౌనంగా ఉండిపోయాను” అని తన భార్య గురించి అలీ చెప్పాడు.

అలీ భార్య గతంలో రెండుసార్లు ప్రియుడితో పారిపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆ జంట తమ వివాహాన్ని చట్టబద్ధంగా ముగించాలని పరస్పరం నిర్ణయించుకుందని వెల్లడించారు. భార్య తీరుతో విసిగిపోయిన భర్త అలీ.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక కోర్టు వారికి డివోర్స్ మంజూరు చేసింది.

Also Read: ఆరు పదుల వయసులో నీట్ క్లియర్ చేసిన వృద్ధులు.. ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తు

“విడాకులు మంజూరు అయ్యాయని నా న్యాయవాది నాకు తెలియజేశారు. నాకు స్వాతంత్ర్యం వచ్చినట్లుంది. ఈరోజు నుంచి నేను స్వేచ్ఛగా ఉండొచ్చు. విడాకులు మంజూరైన ఆనందంలోనే నేను ఇలా 40 లీటర్ల పాలతో స్నానం చేస్తున్నా” అని అలీ చెప్పాడు.

విడాకులు మంజూరు కావడంతో సంబరాలు జరుపుకున్న వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతగాడి ఆనందం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్ రా మావా అంటూ విస్తుపోతున్నారు.