పాక్ అబద్ధం – భారత్ క్లారిటీ : మన యుద్ధ విమానాలను కూల్చలేదు

  • Published By: vamsi ,Published On : February 27, 2019 / 08:00 AM IST
పాక్ అబద్ధం – భారత్ క్లారిటీ : మన యుద్ధ విమానాలను కూల్చలేదు

Updated On : February 27, 2019 / 8:00 AM IST

భారత్‌కు చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించుకోగా.. ఆ వార్తలను భారత్ ఖండించింది. భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలు కూల్చివేసినట్టు పాకిస్తాన్‌ చెబుతున్న మాటల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో పాక్‌ చేస్తున్న ప్రకటనలు పూర్తిగా అవాస్తవం అంటూ పేర్కొంది. దాడులు జరిగినట్టు పాక్‌ మీడియా చూపిస్తున్న దృశ్యాలు గతంలో జోధ్‌పూర్‌ ప్రమాదానికి సంబంధించినవి అని స్పష్టం చేసింది. పాత దృశ్యాలు చూపించి పాకిస్తాన్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందంటూ విమర్శించింది.

పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించిన ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు పాకిస్తాన్ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విటర్‌లో వెల్లడించారు. ఒకటి పీవోకేలో పడిందని మరొకటి కశ్మీర్‌లో పడిందని పేర్కొన్నారు. ఒక పైలెట్‌ని అరెస్ట్ చేశామంటూ చెప్పుకొచ్చారు.
Also Read: కాశ్మీర్ లో కూలిన యుద్ధ విమానం : ఇద్దరు పైలెట్లు మృతి

పాక్ చెప్పేదంతా పచ్చి అబద్దం.. 
వైమానిక దాడులపై పాకిస్థాన్ అసత్య ప్రచారం చేస్తోందని, పాకిస్తాన్ మీడియాలో రాసే అవాస్తవాలను నమ్మొద్దు అని భారత్ అధికారులు చెబుతున్నారు. ఆ వార్తలు నిజం కాదంటూ స్పష్టం చేస్తున్నారు. ఐఎఎఫ్ రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్టు పాక్ వాదనను భారత్ తీవ్రంగా వ్యతిరికిస్తోంది. కవ్వింపు చర్యల్లో భాగంగా పాక్ ఇలాంటి కట్టు కథలను అల్లుతోందని, పాకిస్థాన్ గగనతలంలోకి మన విమానాలు వెళ్లలేదని భారత్ క్లారిటీ ఇచ్చింది. భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చినట్టు పాకిస్థాన్ మేజర్ జనరల్ గఫూర్ చేసిన ప్రకటనలో నిజం లేదని వెల్లడించింది. కూల్చిన యుద్ధ విమానాల్లో ఒకటి పాకిస్థాన్ భూభాగం, మరొకటి భారత్ భూభాగంలో పడినట్టు, భారత పైలట్ ను పట్టుకున్నట్టు పాక్ పచ్చి అబద్దం చెబుతోందని కొట్టిపారేసింది.
Also Read: అణ్వాయుధాల టీమ్ తో ఇమ్రాన్ ఎమర్జన్సీ మీటింగ్

బడ్ గామ్ లో మన విమానం కూలిపోయిందని, పాక్ విమానం చొరబడిన ప్రాంతానికి చాలా దూరంలో మన విమానం కూలిపోయినట్టు తెలిపింది. మనను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినట్టు పేర్కొంది. దాడిచేసేందుకు భారత్ వాయిసేన విమానం ఎప్పుడు కూడా ఒక్కటిగా వెళ్లదని స్పష్టం చేసింది. భారత్ దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని తమ ప్రజలను నమ్మించేందుకు పాక్ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతోందని తెలిపింది.  

Also Read: ఎంత బరితెగింపు : భారత్ లో బాంబులు వేసి వెళ్లిన పాక్ యుద్ధ విమానాలు