Bharat Biotech : భారత్ బయోటెక్ కీలక ప్రకటన..వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయొద్దు!
జనవరి 3 నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సువారికి కోవిడ్ వ్యాక్సిన్ పంపీణీ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుమారు 148 కోట్ల డోసుల వ్యాక్సిన్లను కేంద్రం పంపిణీ చేసింది.

Bharat Biotech
Bharat Biotech : జనవరి 3 నుంచి దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయస్సువారికి కోవిడ్ వ్యాక్సిన్ పంపీణీ జరుగుతోన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని చోట్లా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. అయితే ఈ సమయంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ కీలక ప్రకటన చేసింది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన పనిలేదని,తాము అలా సూచించలేదని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ట్విట్టర్లో ఓ ప్రకటన చేసింది.
భారత్ బయోటెక్ తన ప్రకటనలో….కొవాగ్జిన్ వ్యాక్సిన్ పొందిన పిల్లలకు ఆయా టీకా కేంద్రాల్లో పారాసెటమాల్ 500 ఎంజీ. టాబ్లెట్లు 3 చొప్పున ఇస్తున్నట్లు మాకు తెలిసింది. కొవాగ్జిన్ తీసుకున్నవారు పారాసెటమాల్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ వాడాల్సిన పనిలేదు. 30 వేలమందిపై మేం క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. 10 నుంచి 20 శాతం మందికే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. అవి కూడా చిన్నవే. ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. ఎలాంటి మందులు వాడొద్దు. డాక్టర్ ని సంప్రదించాకే.. మెడికేషన్ పాటించండి. వేరే ఇతర వ్యాక్సిన్లు తీసుకున్నవారికి పారాసెటమాల్ తీసుకోవాలని సూచించారు. కొవాగ్జిన్‌కు అవసరం లేదు”అని తెలిపింది.
ALSO READ Tirupati Murder Case : ఏపీ టూరిజం ఉద్యోగి హత్య కేసు.. ‘దృశ్యం’ సినిమా తరహాలో క్రైమ్