Karnataka Election Result 2023: కర్ణాటకలో గత ఫలితాలే పునరావృతం అవుతాయా? 2018లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసా?

కర్ణాటక రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.

Karnataka Election Result 2023: కర్ణాటకలో గత ఫలితాలే పునరావృతం అవుతాయా? 2018లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసా?

Karnataka Polls

Updated On : May 13, 2023 / 10:17 AM IST

Karnataka Polls: కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది సేపట్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 34 జిల్లాల్లో 36 పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం వరకు జరుగుతుంది. అయితే, మధ్యాహ్నం 12గంటల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? హంగ్ ఏర్పడుతుందా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

2018లో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

కర్ణాటక రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో అధికారంకోసం మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలకు తొమ్మిది స్థానాలు వెనుకబడి పోయారు. ఆ పార్టీకి 36.22శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి 38.04శాతం ఓట్లు పోలయ్యాయి. జేడీఎస్ పార్టీ 37 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీకి 18.36 శాతం ఓట్లు పోలయ్యాయి.