ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా ఏంటి? దీని వల్ల అక్కడున్న ఇండియన్స్ కి వచ్చే నష్టం ఏంటి?
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల లిస్టులో మనవాళ్లు చాలా మంది ఉన్నారు.

అక్రమ వలసదారులను తమ దేశం నుంచి పంపించేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల్లోని సంపన్నులను మాత్రం ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోల్డ్‌కార్డ్ వీసాను తీసుకొస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపనుంది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల లిస్టులో మనవాళ్లు చాలా మంది ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు చాలామంది భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
గ్రీన్‌కార్డు కొంతమంది భారతీయులకు అందాలంటే దాదాపు 50 ఏళ్లు టైమ్ పట్టొచ్చు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాలతో అమెరికాలో వలస విధానంలో భారీ మార్పులు సంభవించే ఛాన్స్ ఉంది. ఈబీ 5 ప్రోగ్రామ్ కూడా మాయమైపోవడం ఖరారైంది.
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గోల్డ్‌కార్డ్ వీసా అవకాశంతో ఇండియన్లు ఇక వేగంగా తమ వీసా ఆశలను నెరవేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే, అప్పట్లో ఈబీ 5 శ్రేణిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వారికి మాత్రం కాస్త కష్టం. వృత్తి నిపుణుల కంటే వ్యాపారవేత్తలకు ట్రంప్ నిర్ణయం వల్ల బాగా ప్రయోజనాలను చేకూర్చుతుంది.
గోల్డ్‌కార్డ్ వీసాను కావాలనుకుంటే దాదాపు రూ.43.54 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అసలు ఇది అమెరికా పౌరసత్వాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ట్రంప్ ప్రతిపాదించిన గోల్డ్‌కార్డు వీసా ప్రకారం.. రూ.43.54 కోట్లు (5 మిలియన్ డాలర్లు) భరిస్తే అమెరికా నేరుగా పౌరసత్వాన్ని ఇస్తుంది. అప్పట్లో ఈబీ 5 వీసా కింద 8 లక్షల డాలర్ల నుంచి 10.5 లక్షల డాలర్లు ఇన్వెస్ట్ చేసి కనీసం 10 ఉద్యోగాలు సృష్టించాల్సి ఉండేది.
రూ.43.54 కోట్ల డబ్బు ఉంటే గోల్డ్‌కార్డ్ వీసాకు ఇప్పటికే హెచ్-1బీ లేదా ఈబీ2, ఈబీ3 వీసాల వంటివి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో సుమారు 10 లక్షల గోల్డ్ కార్డులను ఇచ్చే అవకాశం ఉంది.