కరోనా లక్షణాలు : డాక్టర్. మంతెన సత్యనారాయణరాజు సలహా

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు అల్లాడి పోతున్నారు. వాళ్ళు సంచంరించే ప్రతిచోట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేతులు ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవటం, మాస్క్ లు ధరించటం.. ఎక్కువసేపు బయట తిరగకపోవటం… జన సమ్మర్ధం ఉన్న ప్రాంతాలకు వెళ్ళకపోవటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మనం రోజు వారి జీవితంలో కొన్ని మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ లక్షణాలు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు చెపుతున్నారు. శరీరానికి హానికలిగించే వైరస్ లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహాన కల్పిస్తూ తన వెబ్ సైట్ లో ఒక వీడియో పోస్టు చేశారు.
మనిషిలో రోగనిరోధక శక్తి పెంచుకోటానికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. అటువంటి లక్షణాలు వచ్చినప్పుడు .. కాచి చల్లార్చిన నీళ్లును తాగాలని.. రోజులో ఎక్కువ సార్లు గోరు వెచ్చని మంచినీళ్లు తాగాలని చెప్పారు. ఒంట్లో నీరసం రాకుండా గోరు వెచ్చని నీళ్లలో రెండు చెంచాల తేనే కలుపుకుని దానికి ఒక చెక్క నిమ్మరసం కలుపుకుని రోజుకు అవసరాన్ని బట్టి 5,6 సార్లు తీసుకోమని చెప్పారు.