Sputnik Light : రెడ్డీస్​‌కు షాక్​.. భారత్‌లో స్పుత్నిక్ లైట్ మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు కేంద్రం షాకిచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌పై దేశంలో మూడో దశ ట్రయల్స్‌కు అనుమతిని నిరాకరించింది.

Sputnik Light : రెడ్డీస్​‌కు షాక్​.. భారత్‌లో స్పుత్నిక్ లైట్ మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి నిరాకరణ

Permission For Phase 3 Trials Of Sputnik Light

Updated On : July 1, 2021 / 12:31 PM IST

Phase 3 Trials of Sputnik Light in India : హైదరాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు కేంద్రం షాకిచ్చింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ కొవిడ్ వ్యాక్సిన్‌పై దేశంలో మూడో దశ ట్రయల్స్‌కు అనుమతిని నిరాకరించింది. కరోనా వ్యాక్సిన్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC) నిపుణులు స్పుత్నిక్ లైట్ ట్రయల్స్ అనుమతులపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. Sputnik Light అనేది సింగిల్ డోసు వ్యాక్సిన్. రష్యా నిర్వహించిన ట్రయల్స్ సమయంలో కరోనాపై ఇది దీని సామర్థ్యం 79.4 శాతం మాత్రమే ప్రభావంతంగా పనిచేస్తుందని తేలింది.

అయితే… ఇప్పుడు స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ పై మూడో దశ ట్రయల్స్ చేయడానికి ఎలాంటి ‘శాస్త్రీయ హేతుబద్ధత’ కనిపించట్లేదని రెగ్యులేటరీ బాడీ అభిప్రాయపడింది. అందుకే రెడ్డీస్ దరఖాస్తును పరిశీలించాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడినట్టు తెలిసింది. మే నెలలో స్పుత్నిక్.వి వ్యాక్సిన్లు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. తొలుత లక్షన్నర డోసులను రష్యా సరఫరా చేసింది. అనంతరం మరికొన్ని రోజులకు 30 లక్షలకుపైగా డోసులను పంపించింది. రీకాంబినెంట్ డీఎన్ఏ సాంకేతికతతో అడినోవైరస్ వెక్టార్లుగా స్పుత్నిక్-V టీకాని అభివృద్ధి చేశారు.

ఇదివరకే డాక్టర్ రెడ్డీస్, దిగుమతి చేసుకున్న సరుకులపై ఆధారపడటం, నాణ్యతా పరీక్షల కారణంగా స్పుత్నిక్ V కమర్షియల్ లాంచ్ వాయిదా పడే అవకాశం ఉందని పేర్కొంది. పైలట్ చివరి దశ ముగిసే నాటికి 28 నగరాలకు పెంచాలని యోచిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.