Earthquake : జపాన్,కాలిఫోర్నియా, అండమాన్ నికోబార్ దీవులు భూకంపం

జపాన్ దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ దేశంతో పాటు కాలిఫోర్నియాలో, అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం భూకంపం వచ్చింది.....

Earthquake : జపాన్,కాలిఫోర్నియా, అండమాన్ నికోబార్ దీవులు భూకంపం

Earthquake Hits Japan

Updated On : August 11, 2023 / 7:14 AM IST

Earthquake : జపాన్ దేశంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ దేశంతో పాటు కాలిఫోర్నియాలో, అండమాన్ నికోబార్ దీవుల్లో శుక్రవారం భూకంపం వచ్చింది. జపాన్ దేశంలోని హోక్కైడో ప్రాంతంలో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని జర్మన్ రీసెర్చ్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూకంపాలకు నిలయమైన జపాన్ దేశంలో శుక్రవారం సంభవించిన భూకంపం 46 కిలోమీటర్ల లోతులో సంభవించింది. (Earthquake Hits Japans Hokkaido)

Hawaii wildfire : హవాయి ద్వీపంలో కార్చిచ్చు…53 కు పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి భవనాలు దగ్ధం

అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ కు 112 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. అండమాన్ దీవుల్లో గురువారం కూడా భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

Nuclear Weapons : ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది…యూఎన్ సంచలన నివేదిక

అమెరికాలోని కాలిఫోర్నియాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైంది. కాలిఫోర్నియాలోని పార్క్ ఫీల్డ్ ప్రాంతంలో సంభవించిన భూకంపంపై యూఎస్ జియోలాజికల్ సర్వే ట్వీట్ చేసింది.