Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భూకంపం తీవ్రత ఎంతంటే…అయోధ్యలోనూ భూప్రకంపనలు
అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం సంభవించింది. తరచూ వరుస భూకంపాలతో అఫ్ఘాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అఫ్ఘాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది....
Earthquake: అఫ్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం సంభవించింది. తరచూ వరుస భూకంపాలతో అఫ్ఘాన్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అఫ్ఘాన్ దేశంలోని ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఫైజాబాద్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో 328 కిలోమీటర్ల దూరం భూకంపం సంభవించిందని అధికారులు చెప్పారు.
Also Read : నేపాల్ భూకంపం ఎఫెక్ట్…128కి పెరిగిన మృతుల సంఖ్య, 140 మందికి గాయాలు
గత వారం అప్ఘానిస్థాన్ దేశంలో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. నెలరోజుల క్రితం అప్ఘాన్ దేశంలోని హేరత్ ప్రావిన్సులో సంభవించిన భారీ భూకంపం వల్ల 4వేల మంది మరణించగా, వేలాది గృహాలు నేలకూలాయి. హేరత్ పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చిందని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.
అయోధ్యలోనూ భూప్రకంపనలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. అయోధ్య భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు అయోధ్యలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఉత్తర అయోధ్యలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఒక వైపు అయోధ్య నగరంలో శ్రీరాముడి ఆలయం నిర్మాణం పూర్తి అయి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా భూప్రకంపనలు సంభవించాయి.
Also Read : Delhi-NCR Earthquake : నేపాల్ భూకంపం ఎఫెక్ట్…ఢిల్లీ,ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు
భూకంపాలను తట్టుకునేలా రామాలయాన్ని నిర్మించినట్లు ఆలయట్రస్టు నేతలు గతంలోనే ప్రకటించారు. నేపాల్ దేశంలో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల 150 మంది మరణించగా, పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ తోపాటు పలు ఉత్తర భారతదేశంలోని ప్రాంతాల్లో శుక్రవారం భూప్రకంపనలు సంభవించాయి.