వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

  • Published By: Chandu 10tv ,Published On : October 22, 2020 / 04:24 PM IST
వృద్ధుడి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

Updated On : October 22, 2020 / 5:07 PM IST

Apple watch saves life:     ఒక చేతి గడియారం 61 సంవత్సరాల పెద్దాయన ప్రాణాలను కాపాడిందంటే మీరు నమ్ముతారా? ఇది నిజమేనండి, ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఇటీవల ఆర్.రాఝాన్స్ అనే రిటైర్డ్ ఫార్మా ప్రొఫెషనల్ అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో ఆ వ్యక్తి వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతకీ అతని చేతికి ఉన్న యాపిల్ వాచ్ వల్లే అతడు రాబోయే ప్రమాదాన్ని ముందుగా గుర్తించగలిగాడు. దీంతో అతడు ప్రాణాలతో  బయటపడటం విశేషం.



రాఝునా కొడుకు సిద్ధార్థ్ యాపిల్ వాచ్ సీరిస్-5 ను ఇటీవల ఆయనకు బహుమతిగా ఇచ్చాడు. ఈ సీరిస్ వాచ్ లో ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (Electrocardiogram-ECG) ఫీచర్ ఉంది. దీంతో ఆయన ఎప్పటికప్పుడు తన హార్ట్ బీట్‌ను చెక్ చేసుకుంటూ ఉండేవారు. కానీ కొద్ది రోజుల కిందట వాచ్‌లో ఆయన అనారోగ్యానికి గురైనట్లు చూపించింది. ఆయన హార్ట్ బీట్‌లో హెచ్చు తగ్గులు ఉన్నట్లుగా వాచ్‌ సందేశం ఇచ్చి , అతని అలర్ట్ చేసింది. దీంతో ఆయన ప్రమాదాన్ని గుర్తించి వెంటనే హాస్పిటల్‌కి వెళ్లారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు వాచ్ చెప్పింది నిజమే. వెంటనే గుండెకు సర్జరీ చేయాలని తెలిపారు.



రాఝునా కి ఈ సమస్య మార్చి నెలలోనే వచ్చింది. కానీ కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆయనకు సర్జరీ చేయడం సాధ్యం కాలేదు. అయినప్పటికి ఆయన చేతి గడియారమే అతడి ప్రాణాలను కాపాడుతూ వస్తోంది. గడియారంలో ఈసీజీ ఫీచర్ ఉండటం వల్లనే ఆయన ఎప్పటికప్పుడు హార్ట్‌బీట్‌ను తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉన్నారు. ఇటీవలనే ఆయన గుండెకు సర్జరీ జరిపించుకున్నారు.



యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఈ విషయం తెలిసి ఆశ్యర్యపోయారు. అంతేకాకుండా తమ కంపెనీ వాచ్ వల్ల ఆయన పెద్దాయన ప్రాణాలతో బయటపడటం మాకు చాలా సంతోషకరమైన విషయమని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.



రాఝునా కొడుకు సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘మా నాన్నకు మిట్రాల్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశారు. యాపిల్ వాచ్ లో ECG ఫీచర్ వల్ల ఆయన హార్ట్‌బీట్‌ను గమనించటానికి ఈ వాచ్ ఎంతో ఉపయోగపడింది. ఈ వాచ్ మా నాన్న ప్రాణాలు కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇదే.. మా నాన్న ప్రాణాలు కాపాడింది’ అని ఈ సందర్భంగా తెలిపారు.