Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ.. 17 మందిపై అభియోగాలు నమోదు
ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను కూడా ఈడీ ప్రస్తావించింది.

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రెండో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో పలువురు కీలక వ్యక్తులు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది.
NSA Ajit Doval: అమెరికా సెక్రటరీతో అజిత్ ధోవల్ భేటీ.. రక్షణ రంగ సహకారంపై చర్చ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. అయితే, వీరి పేర్లను నిందితులుగా కాకుండా, కేవలం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈడీ దాఖలు చేసింది సప్లిమెంటరీ చార్జిషీటులో మొత్తం 428 పేజీలున్నాయి. ఈ చార్జిషీటును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిందితుల్ని ఏ1, ఏ2 నుంచి ఏ17 వరకు పరిగణిస్తూ నోటీసులు ఇచ్చింది. వీళ్లంతా తదుపరి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరుగుతుంది.
హవాలా రూపంలో వచ్చిన నిధులను గుజరాత్, గోవా ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడుకుందని ఈడీ చార్జిషీటులో పేర్కొంది. ఆప్ సర్వే బృందాల్లోని వాలంటీర్లకు రూ.70 లక్షల చొప్పున నగదు బదిలీ జరిగిందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. ఈ కేసు విచారణలో అనేక మందిని విచారించినప్పటికీ ఇప్పటివరకు ఈడీ ఎలాంటి నగదును స్వాధీనం చేసుకోలేదు.
అయితే, నిందితులు కొందరు సాక్ష్యాల్ని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. మద్యం కంపెనీలకు అనుకూలంగా ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలీసీని రూపొందించడం ద్వారా కేజ్రీవాల్ ప్రభుత్వంతోపాటు, పలువురు వ్యక్తులు లాభపడ్డారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. అలాగే మనీలాండరింగ్, అక్రమ లావాదేవీలు వంటివాటిపై కూడా ఈడీ విచారిస్తోంది.