మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది

  • Published By: vamsi ,Published On : March 10, 2019 / 11:47 AM IST
మోగిన ఎన్నికల నగారా.. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది

Updated On : March 10, 2019 / 11:47 AM IST

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు సునీల్ అరోరా.

షెడ్యూలు ప్రకటించిన మరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిసా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్‌లో 60స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.  కాగా ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 3వ తేదీతో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల బృందం అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, ఎన్నికల నిర్వహణకు అనుకూలమని నిర్ణయించుకున్నాకే షెడ్యూల్ విడుదల చస్తున్నట్లు ప్రకటించింది.