రష్యా – యుక్రెయిన్ యుద్ధానికి అమెరికానే కారణమా.. ఎలాన్ మస్క్ వీడియో వైరల్

రష్యా - యుక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వార్ కు ప్రధాన కారణం ..

రష్యా – యుక్రెయిన్ యుద్ధానికి అమెరికానే కారణమా.. ఎలాన్ మస్క్ వీడియో వైరల్

Elon Musk

Updated On : November 13, 2024 / 1:13 PM IST

Russia-Ukraine war Elon Musk Video: రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా యుద్ధంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాలు ఒకరిపైఒకరు దాడులు చేసుకుంటున్నాయి. అయితే, ఇరు దేశాల మధ్య వార్ ప్రారంభం కావటానికి అమెరికానే కారణమని అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ డి సాచ్స్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ షేర్ చేశారు. ఇది ఇంట్రస్టింగ్ టాపిక్ అంటూ పేర్కొన్నాడు.

Also Read:  Khalistani Issue : ఖలీస్తానీలు హిందూ ఆలయాలనే ఎందుకు టార్గెట్‌ చేశారు?

ఈ వీడియోలో అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ డి సాచ్స్ రష్యా – యుక్రెయిన్ వార్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా యూఎస్ విధానాలను ఆయన బహిరంగంగా విమర్శించారు. రష్యా దూకుడు కంటే నాటో విస్తరణ అసలు వివాదానికి కారణం. యుక్రెయిన్ ను నాటోలో చేర్చాలన్న అమెరికా విధానమే రష్యా సైనిక చర్యలకు ప్రధాన కారణమని జెఫ్రీ డి సాచ్స్ పేర్కొన్నాడు. ‘ఇది యుక్రెయిన్ పై వ్లాదిమిర్ పుతిన్ చేసిన దాడి కాదు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ పరిపాలన, అనాలోచిత నిర్ణయం కారణంగా రష్యా యుక్రెయిన్ పై దాడికి దిగాల్సి వచ్చింది’ అంటూ జెఫ్రీ డి సాచ్స్ పేర్కొన్నాడు. ఈ వీడియోను ఎలాన్ మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. దారిపై అమెరికా, నాటో యుక్రెయిన్ లో యుద్ధానికి ఎలా కారణం అయ్యాయో జెఫ్రీ డి సాచ్స్ వివరించారు అంటూ రాసి ఉంది.