Unemployment Rate: తగ్గిపోనున్న ఉద్యోగ అవకాశాలు… నిరుద్యోగులకు ఈ ఏడాది గడ్డుకాలమే అంటున్న నివేదిక

‘ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ)’ నిరుద్యోగ అంశంపై తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరగబోతుంది.

Unemployment Rate: తగ్గిపోనున్న ఉద్యోగ అవకాశాలు… నిరుద్యోగులకు ఈ ఏడాది గడ్డుకాలమే అంటున్న నివేదిక

Updated On : January 16, 2023 / 7:32 PM IST

Unemployment Rate: నిరుద్యోగులకు ఈ ఏడాది గడ్డుకాలమే అని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దీని ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరగబోతుందట.

Siberian City: ఇదే అత్యంత చల్లటి నగరం.. చలి తట్టుకోవాలంటే క్యాబేజీలా డ్రెస్ చేసుకోవాలంటున్న స్థానికులు

‘ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ)’ నిరుద్యోగ అంశంపై తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం… ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం పెరగబోతుంది. వృద్ధి రేటు 1 శాతానికి తగ్గే అవకాశం ఉంది. రష్యా–యుక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం వంటి కారణాలతో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది 5.8 శాతం నిరుద్యోగిత రేటు పెరుగుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 20.8 కోట్ల మంది నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది.

Swiggy Delivery Boy: బిల్డింగ్‌పై నుంచి పడ్డ స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ప్రస్తుతం నిరుద్యోగిత రేటు భారీగా పెరగబోతుంది. ఇదంతా 2025కల్లా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు నిత్యావసరాలు, జీవన వ్యయం మాత్రం పెరుగుతుంది. సామాన్యులకు అందకుండా ధరలు పెరుగుతాయి. దీంతో ప్రజలు మరింత పేదరికంలోకి వెళ్లే అవకాశం ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇలాగే కొనసాగితే, ఈ పరిస్థితి మరింత దిగజారవచ్చు.

తక్కువ, మధ్య స్థాయి ఆదాయ దేశాలు మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రస్తుత అంచనా ప్రకారం.. చాలా మంది నిరుద్యోగులు తక్కువ స్థాయి పనులు లేదా తక్కువ వేతనాలతో సరిపుచ్చుకోవాల్సిందే.