Naugam Encounter : నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

సెంట్రల్ కాశ్మీర్‌లోని శ్రీనగర్ శివార్లలోని నౌగంలో వాగురా ప్రాంతంలో మంగళవారం (జూన్ 15) అర్ధరాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్‌లో హతమయ్యారు.

Naugam Encounter : నౌగామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Encounter Breaks Out In Naugam In Jammu And Kashmir 2 Terrorists Killed

Updated On : June 16, 2021 / 7:14 AM IST

Naugam Encounter : సెంట్రల్ కాశ్మీర్‌లోని శ్రీనగర్ శివార్లలోని నౌగంలో వాగురా ప్రాంతంలో మంగళవారం (జూన్ 15) అర్ధరాత్రి ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్‌లో హతమయ్యారు. కాశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. శ్రీనగర్‌లోని నౌగం ప్రాంతమైన వగూరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్టు భద్రతా దళాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF బలగాలు సంయుక్త ఆపరేషన్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

ఉగ్రవాదులు దాగిన ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సెర్చ్ పార్టీ బలగాలను గమనించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసు అధికారి పేర్కొన్నారు. సైన్యం ఎంట్రీ, ఎగ్జిట్‌ ప్లాయింట్లను మూసివేసింది. భారీగా బలగాలను అక్కడికి తరలించారు. చీకటి పడటంతో ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండేందుకు లైట్లను అమర్చారు.