ఎన్ కౌంటర్: కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
Encounter in Kulgam, two millitants killed

Encounter in Kulgam, two millitants killed
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాం జిల్లా కటపోర ప్రాంతంలో శనివారం సాయంత్రం భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని కటపోర ప్రాంతంలో శనివారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతాదళాలను చూసిన ఉగ్రవాదులు వారి పైకి కాల్పుల జరిపారు. ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా ఘటనాస్దలంలో మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేతకు సిధ్దమయ్యాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి.