Yashraj Mukhate : మాటల్ని పాటలుగా మార్చే స్వర మాంత్రికుడు.. ఇంజనీర్ టర్నెడ్ కంపోజర్ యష్‌రాజ్ ముఖాటే
ఇంజనీరింగ్ చదువుకున్నా సంగీతంపై ఇష్టంతో మ్యూజిక్ కంపోజర్‌గా మారాడు. మాటల్ని పాటలు కట్టేసి మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాడు. ఇంజనీర్ టర్నెడ్ కంపోజర్ యష్‌రాజ్ ముఖాటే ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి.

Yashraj Mukhate
Yashraj Mukhate : డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారు.. యాక్టర్ అవ్వబోయి ఇంజనీర్ అయ్యారు.. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాము. చదువుకి మనలో ఉండే టాలెంట్‌కి సంబంధం ఉండదు. ఒక్కోసారి టాలెంట్ కొందరిని శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. యష్‌రాజ్ ముఖాటే ఇంజనీర్ కాస్త మ్యూజిక్ కంపోజర్ అయ్యారు. వైరల్ కంటెంట్ నుండి పాటలను క్రియేట్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు.
Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి
మీరు ఏదైనా మాట్లాడుతుంటే ఆ మాటలకి మ్యూజిక్ కంపోజ్ చేసి అద్భుతమైన పాటలా క్రియేట్ చేయగలరు యష్‌రాజ్ ముఖాటే. ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌తో సక్సెస్ అయ్యాక ప్రముఖ సంగీత దర్శకులు కూడా అతని టాలెంట్‌ను గుర్తించడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరీ యష్‌రాజ్ ముఖాటే అంటే. సోషల్ మీడియాని రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటే యష్‌రాజ్ ముఖాటే గురించి తప్పకుండా వినే ఉంటారు. ఇంజనీరింగ్ చదువుకున్నా మ్యూజిక్ కంపోజర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో 7.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన 27 సంవత్సరాల ముఖాటే ‘రసోదే మే కౌన్ థా?’ అనే వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ‘సాధ్ నిభానా సాథియా’ షోలో రూపాల్ పటేల్ పోషించిన కోకిలా బెన్ పాత్ర చెప్పే డైలాగ్ ఉంటుంది. దీనిని పాటగా కంపోజ్ చేసారు. 2020 లో కోవిడ్ టైంలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ముఖాటే ఫన్నీ పాటలను కంపోజ్ చేయడం ప్రారంభించారు. ఆయన పాటకు వీడియోల్లో చీపురు, చెంచా ఉపయోగించి రకరకాల శబ్దాల ప్రయోగాలు చేశారు.
74-year-old Hasan Ali Story : 74 ఏళ్ల రుమాళ్ల వ్యాపారి హసన్ అలీ స్ఫూర్తివంతమైన కథనం చదవండి
తల్లిదండ్రుల కోరిక మేరకు ముందుగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత యష్‌రాజ్ ముఖాటే ఔరంగాబాద్‌లో సొంత స్టూడియో ప్రారంభించారు. వివిధ రకాల ప్రాజెక్టుల కోసం ఫ్రీలాన్సింగ్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో తన వీడియోలతో చాలా పాపులర్ అయ్యారు. ముఖాటే రీసెంట్ గా Spotify, Apple Music వంటి ప్రధాన సంగీత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ‘రస్మలై’ పేరుతో నాలుగు నిమిషాల పాటను విడుదల చేసారు. అలోక్ రంజన్ శ్రీవాస్తవ రాసిన ఈ పాటను ముఖాటే కంపోజ్ చేసి పాడారు.
ముఖాటే రీసెంట్‌గా ఓ మరాఠీ సినిమాకి ఒక పాటను కంపోజ్ చేసారట. త్వరలో మరిన్ని పాటలకు సంగీతం అందించబోతున్నారు. యష్‌రాజ్ ముఖాటే పాటలు వినాలనుకుంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో (yashrajmukhate ) కంపోజ్ చేసిన కొన్నిపాటల వీడియోలు చూసేయండి. విభిన్నమైన టాలెంట్‌తో దూసుకుపోతున్న యష్‌రాజ్ ముఖాటే భవిష్యత్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీ అవ్వాలని ఆశిద్దాం.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram