EPF account: ఆరుకోట్ల ఈపీఎఫ్ చందాదారులకు రెండు విడతలుగా వడ్డీ

ఉద్యోగుల ఈపీఎఫ్ ఎకౌంట్లలో 2019-20 యేడాదికి 8.5శాతం వడ్డీని జమ చేయడానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO నిర్ణయించింది. కాకపోతే ఓ షరతు. ఇప్పుడు ఆర్దిక ఇబ్బందుల వల్ల, మొత్తం 6కోట్ల చందాదారులకు ముందు 8.15శాతం చెల్లించి, మిగిలిన 0.35 శాతాన్ని డిసెంబర్ లో చెల్లించాలని ట్రస్టీల నిర్ణయం తీసుకుంది.
వివాదస్పదమైన స్టాక్ మార్కెట్ లో ఈపీఎఫ్ నిధులను పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయాన్ని ట్రస్టీల సమావేశం ఉపసంహరించుకుంది. మార్కెట్లు గాలివాటంగా మారాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.