PF Interest Money : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్… వడ్డీ డబ్బులు జమ.. ఇలా చెక్ చేసుకోండి..
పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. రూ.23.44 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు ట్వీట్ చేసింది.
PF Interest Money : పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను జమ చేసినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. రూ.23.44 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసినట్లు ట్వీట్ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.5 శాతం వడ్డీ రేటును పీఎఫ్ అకౌంట్లలో డిపాజిట్ చేసినట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయ్యింది.
ఇకపోతే పీఎఫ్ ఖాతాదారులు సులభంగానే తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వడ్డీ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు. వడ్డీ ఎంత మొత్తం జమ అయిందో.. మొత్తంగా ఎంత బ్యాలెన్స్ ఉందో ఉద్యోగులు స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం పని చేస్తున్న సంస్థను అడగాల్సిన అవసరం లేదు. పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో చెక్ చేసుకునేందుకు నాలుగు సులభ మార్గాలున్నాయి. వీటి ద్వారా అకౌంట్ లో ఎంత డబ్బు ఉన్నది ఇట్టే తెలుసుకోవచ్చు.
WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!
1. ఈపీఎఎఫ్ఓ (EPFO) వెబ్సైట్ ద్వారా..
ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో యూఏఎన్ (UAN) నంబర్, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయి.. పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ http://www.epfindia.gov.in లోకి వెళ్లి పైన అవర్ సర్వీసెస్ ఆప్షన్లలో రెండోది ఎంప్లాయిస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాతి పేజీలో కింది భాగంలో సర్వీసెస్‌లో మెంబర్ పాస్‌బుక్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే బ్యాలెన్స్ వివరాలతో కూడిన పాస్ బుక్ వస్తుంది. అలాగే నేరుగా పాస్‌బుక్ పేజీలోకి వెళ్లాలంటే https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login ఈ లింక్ ద్వారా చేరుకొని లాగిన్ కావొచ్చు.
2. ఎస్ఎంఎస్ ద్వారా..
యూఏఎన్ నంబర్ ఉంటే.. ఇంటర్నెట్ లేకుండా, వెబ్సైట్లోకి వెళ్లకుండా కూడా మీ అకౌంట్ లో ఎంత మొత్తం ఉందో తెలుసుకునే విధానం ఇది. మీ పీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ద్వారా 7738299899 అనే నంబర్‌కు మెసేజ్ చేస్తే బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UAN నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ENG అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. అంతే ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.
3. మిస్డ్ కాల్ ద్వారా..
పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకునేందుకు సులువైన మార్గం ఇదే. మీ పీఎఫ్ ఖాతాతో లింక్ అయిన ఫోన్ నంబర్ నుంచి 011-22901406 నంబర్‌కు జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే సరి. ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉందనే మెసేజ్ వస్తుంది.
WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్
4. ఉమాంగ్ యాప్ (Umang App) యాప్ ద్వారా..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ ఖాతా వివరాలు ఉద్యోగులు చెక్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని.. లాగిన అయ్యాక అందులో చాలా ప్రభుత్వ సర్వీసులు కనిపిస్తాయి. అక్కడ ఈపీఎఫ్ఓ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్ నమోదు చేస్తే.. ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి పీఎఫ్ ఖాతా వివరాలు చూడవచ్చు.