యమరాజైనా జాలి చూపిస్తాడు.. ఢిల్లీ ఆందోళనలపై శివసేన ఎంపీ

యమరాజైనా జాలి చూపిస్తాడు.. ఢిల్లీ ఆందోళనలపై శివసేన ఎంపీ

Updated On : March 8, 2020 / 3:53 PM IST

ఫిబ్రవరి నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆందోళనలు చూసి యమరాజు అయినా జాలి చూపిస్తాడని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. మానవాతీతంగా జరుగుతున్న చావులను చూసి ఆ యమరాజు కూడా చలిస్తాడు ఈ పరిస్థితులని చూసి అన్నారు. రోక్‌తక్ అనే పత్రికలో పార్టీ గొంతు వినిపిస్తూ అమిత్ షాపై పరోక్ష విమర్శలకు దిగారు. 

‘రాజకీయాలు మానవత్వాన్ని మర్చిపోతున్నాయి. అక్కడి నుంచి చరిత్రలో క్రూరమైన మత సిద్ధాంతాలు బయటికొస్తున్నాయి. అక్కడి నుంచే జాతీయవాదమనేది పుట్టుకొచ్చింది. ఈ జాతీయవాదం దేశంలోని మిగిలిన వారిని కూడా చంపేస్తుంది’ అని రాశారు. ఈ ఆందోళనల కారణంగా చాలా కమ్యూనిటీల్లో చిన్నారులు అనాథలుగా మిగిలిపోయే అవకాశం ఉంది. 

అంతకంటే ముందు ఢిల్లీ అల్లర్లు జరిగిన 50మంది చనిపోయిన సమయంలో అమిత్ షా ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లు 1984లో సిక్కుల ఆందోళలకు సమానంగా ఉన్నాయని అన్నారు. 

హిందూత్వం, మత చాదస్తం, హిందూ-ముస్లిం, క్రిస్టియన్-ముస్లిం అంశాలపై పోరాడుతూ.. విధ్వంసం అంచుల్లో ఉంది. మతపరమైన ఆందోళనల కారణంగా చాలా మంది చనిపోతున్నారు. దేవుడి పేరు చెప్పుకుని అన్నీ చేస్తున్నారు. ఈశ్వర్ లేడు, అల్లాహ్ లేడు, జీసస్ లేడు. ప్రజలు వారి సామర్థ్యాన్ని నమ్మడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా అవసరమైనప్పుడు తలుపులు మూసేసుకుని కూర్చొని ఉంది’

‘తండ్రి శవం పక్కన ఓ అనాథ నిల్చొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఆందోళనల కారణంగా అలా  చనిపోయిన 50మంది కుటుంబాల పరిస్థితి ఏంటి. 500మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఫొటోలన్నీ చూసిన తర్వాత.. ఇంకా ప్రజలు హిందూ-ముస్లిం అనే బేధభావాలు ఉన్నాయంటే అది వారి మానవత్వానికి చావే’ అని రాసుకొచ్చాడు.