TMC, BJP కార్యకర్తల ఘర్షణ: ముక్కలైన EVM

పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో చోప్రా నియోజకవర్గంలో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఓ పోలింగ్ బూత్‌లోని ఈవీఎం ధ్వంసమైంది. ఓటింగ్ మిషన్ ముక్కలైంది. చోప్రాలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ నేతలు తమను ఓటు వేయకుండా అడ్డుకున్నారని..స్థానికులు ఆరోపించారు. తమను ఓటు వేయకుండా అడ్డుకునేవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం 34వ నంబరు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారికి సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
బెంగాల్ లో తొలి విడతగా మూడు లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్ జిల్లాలో కొందరు నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.రాయ్ గంజ్, దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్ ప్రాంతంలో ఆందోళనలు నెలకొన్నాయి. కాగా ఉదయం సీపీఎం నేత సలీమ్ కారుపై రాళ్లుతో కొందరు దాడి చేశారు. రాయ్‌గంజ్ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది.
West Bengal: An EVM was vandalized during a clash between TMC and BJP workers in Chopra; More details awaited. #LokSabhaElections2019 pic.twitter.com/pjuEaSuD0p
— ANI (@ANI) April 18, 2019