మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ మృతి

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 04:05 AM IST
మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ మృతి

Updated On : January 29, 2019 / 4:05 AM IST

ఢిల్లీ : మాజీ రక్షణ శాఖా మంత్రి..బీజేపీ నేత జార్జ్ ఫెర్నాండేజ్ మృతి చెందారు. ఢిల్లీలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఫెర్నాండేజ్ తన 88 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అల్జీమర్స్‌తో పాటు వయసుకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా స్వైన్ ఫ్లూతో బాధపడిన జార్జి ఫెర్నాండేజ్ ఈరోజు (జనవరి 29) ఉదయం 7 గంటలకు తన నివాసంలో మృతి చెందారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పెయ్ కేబినెట్ లో రక్షణశాఖా మంత్రిగా ఫెర్నాడేజ్ పనిచేశారు. ఫెర్నాండేజ్ కు భార్య, కుమారుడు ఉన్నారు.

1930 జూన్ 3న మంగళూరులో జన్మించిన ఆయన,  1967లో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. జనతాదళ్ పార్టీలో కీలక నేతగా ఎదిగి, ఆపై సమతా పార్టీని స్థాపించారు.వాజ్ పేయి హయాంలో  రక్షణ శాఖతో పాటు సమాచార, పరిశ్రమల, రైల్వే శాఖలను కూడా నిర్వహించారు. ఫెర్నాండెజ్ మృతికి పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను  గుర్తు చేసుకున్నారు.

ఫెర్నాండేజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో సుదీర్ఘకాఃలం ఉన్న ఆయన ఎప్పుడూ తన రాజకీయ సిద్దాంతాలతో ఎప్పుడూ రాజీపడలేదని తెలిపారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు.