క్లాసు రూంలో ముద్దులాట: ఆరుగురు స్టూడెంట్స్ సస్పెండ్

మేం వయస్సుకు వచ్చాం. పరువానికి వచ్చాం.. అంటూ ఓ ఆరుగురు విద్యార్థులు చేసిన తింగర పనికి స్కూల్ నుంచి సస్పెండ్ అయ్యారు.

  • Published By: sreehari ,Published On : January 23, 2019 / 09:30 AM IST
క్లాసు రూంలో ముద్దులాట: ఆరుగురు స్టూడెంట్స్ సస్పెండ్

Updated On : January 23, 2019 / 9:30 AM IST

మేం వయస్సుకు వచ్చాం. పరువానికి వచ్చాం.. అంటూ ఓ ఆరుగురు విద్యార్థులు చేసిన తింగర పనికి స్కూల్ నుంచి సస్పెండ్ అయ్యారు.

హౌరా: మేం వయస్సుకు వచ్చాం. పరువానికి వచ్చాం.. అంటూ ఓ ఆరుగురు విద్యార్థులు చేసిన తింగర పనికి స్కూల్ నుంచి సస్పెండ్ అయ్యారు. చదువుకోవాల్సిన క్లాసు రూంలో ముద్దులాడుకున్నారు. దీంతో స్కూలు యాజమాన్యం ఆరుగురు విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి పంపేసింది. తల్లిదండ్రులు ఏదోలా తమ పిల్లలకు రీ అడ్మిషన్ ఇవ్వాలని మేనేజ్ మెంట్ ను బతిమిలాడటంతో వార్షిక పరీక్షల వరకు వారికి అవకాశం కల్పించారు. అనంతరం ఆరుగురు విద్యార్థులను స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. గత ఏడాది శిబ్ పూర్ బీఈ కాలేజీ మోడల్ స్కూల్లో దుర్గా పూజను నిర్వహించారు.

ఈ సందర్భంగా స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు జంటగా క్లాసురూంలోకి దూరి ముద్దులు పెట్టుకున్నారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇటీవల సీసీ దృశ్యాలను స్కూల్ మేనేజ్ మెంట్ పరిశీలించగా షాకింగ్ దృశ్యాలు బయటపడ్డాయి. షాకైన స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్బీ గేయిన్.. వెంటనే ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పిల్లల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు వారి భవిష్యత్ నాశనం కాకూడదనే ఉద్దేశంతో ఆరుగురికి వార్షిక పరీక్షలు రాసేవరకు గడువు ఇచ్చారు. పరీక్షల అనంతరం తమ స్కూల్ నుంచి సస్పెండ్ చేయనున్నట్టు హెడ్ మాస్టర్ గేయిన్ స్పష్టం చేశారు.