ITR : ఐటీఆర్‌ గడువు పొడిగింపు

కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్‌) దాఖలు చివరి తేదీని పొడిగించింది.

ITR : ఐటీఆర్‌ గడువు పొడిగింపు

Income

Updated On : August 12, 2021 / 10:01 PM IST

Extends deadline for ITR : కరోనా సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్‌) దాఖలు చివరి తేదీని పొడిగించింది. జూలె 31 నుంచి సెప్టెంబర్‌ 30, 2021 వరకు పొడిగించింది. సాఫ్ట్‌వేర్‌ లోపం కారణంగా ఇప్పటికే పన్ను చెల్లింపుదారులు అదనపు వడ్డీ, లేట్ ఫీజును చెల్లించినట్లైతే వాటిని రీఫండ్‌ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

జూలై 31 తర్వాత నుంచి లేట్ ఫీజులు, వడ్డీలు వసూలు చేస్తున్నారని కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదులు చేశారని.. ఈ నెల ఒకటో తేదీన సాఫ్ట్‌వేర్‌ లోపం సరిదిద్దామని ఐటీ శాఖ ట్వీట్‌లో పేర్కొంది. లేటెస్ట్‌ వెర్షన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు సూచించింది.

ఇప్పటికే ఎవరైనా పన్ను చెల్లింపుదారులు అదనపు వడ్డీ లేదా ఆలస్య రుసుములతో ఐటీఆర్‌లను సమర్పించినట్లైతే సీపీసీ-ఐటీఆర్‌ ప్రాసెస్‌లో సరి చేయబడుతుందని ఐటీ శాఖ తెలిపింది. ఏదైనా అదనపు చెల్లింపులుంటే వాటిని సాధారణ కోర్స్‌లో రీఫండ్‌ చేస్తామని వివరించింది.