Central Government : సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ రెండు వేర్వేరు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది.

Central Government : సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Cbi And Ed

Updated On : November 14, 2021 / 8:53 PM IST

CBI and ED Directors : సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ రెండు వేర్వేరు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ మేరకు ఆర్డి నెన్సులపై సంతకం చేశారు. ప్రస్తుతం సీబీఐ, ఈడీ సంస్థల డైరెక్టర్ల పదవీకాలం రెండేళ్ల వరకే ఉంది.

కేంద్రం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్సుల ప్రకారం రెండేళ్ల పదవీ కాలం పూర్తయ్యాక ఏడాది చొప్పున మొత్తం ఐదేళ్ల వరకు సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించే ఛాన్స్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత పొడిగించడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఈ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Pawan Kalyan : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులు మళ్లింపు దురదృష్టకరం : పవన్ కళ్యాణ్

ఈడీ డైరెక్టర్ ఎస్ కే మిశ్ర పదవీకాలం పొడిగింపు విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసాధారణ, అరుదైన సందర్భాల్లో మాత్రమే పదవీ కాలాన్ని పొడిగించాలని తెలిపింది. వచ్చే వారం ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తికావొస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్ఢినెన్సులు తీసుకురావడం గమనార్హం.