సీఏఏ ఆందోళనల్లో హిందూ దేవుళ్ల ఫొటోలు కాల్చివేత….నిజం ఇదే

  • Published By: venkaiahnaidu ,Published On : January 3, 2020 / 03:32 AM IST
సీఏఏ ఆందోళనల్లో హిందూ దేవుళ్ల ఫొటోలు కాల్చివేత….నిజం ఇదే

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడ్డికట్టే చలి ఉన్న ఢిల్లీలో కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనల సమయంలో జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొంతమంది హిందూ దేవుళ్ల పోస్టర్లను తగులబెడుతున్నట్లు ఉంది. 

షాకింగ్. సీఏఏ ఆందోళనల పేరిట హిందూ దేవుళ్ల,దేవతల ఫొటోలను కాల్చడానాకి ఈ వెధవలకి ఎంత ధైర్యం…సీఏఏ హిందువలను ఏం చేస్తుంది..వాళ్ల అజెండా వేరు..కాంగ్రెస్ పార్టీ,సీపీఐకి చెందిన నాయకులు ఇవన్నీ చేయిస్తున్నారంటూ డాక్టర్ జయశ్రీ నాయర్ అనే మహిళ ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేయగా వేల సంఖ్యలో రీట్వీట్లు వచ్చాయి. చాలామంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఈ వీడియోను రీట్వీట్ చేసినవారిలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ఉన్నారు. ఇదేనా కాంగ్రెస్,కమ్యూనిస్టులు ప్రమోట్ చేస్తున్నది అంటూ సంబిత్ పాత్ర ఆ వీడియో రీట్వీట్ చేశారు. ఫేక్ బుక్ లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. హిందూ వ్యతిరేకులు,దేశ వ్యతిరేకులు వీళ్లు అంటూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. 

అయితే అసలు ఈ వీడియో ఇప్పటిది కాదని తెలుస్తోంది. 2018లో ఈ వీడియో బాగా సర్క్యులేట్ అయినట్లు గూగుల్ సెర్చ్ చెబుతోంది. 2018లో యూటూబ్యూలో ఇదే వీడియో భీమ్ ఆర్మీ కార్యకర్తలు హిందూ దేవుళ్లను అగౌరవపరుస్తున్నారంటూ 2018లో యూటూబ్యూలో ఇదే వీడియో షేర్ చేయబడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫేస్ బుక్ లో కూడా..యంగ్ అంబేద్కరిస్టులు మైసూర్ లోని అశోక్ పురంలో హిందూ దేవుళ్ల ఫోటోలను తగులబెడుతున్నారంటూ ఈ వీడియో క్లిప్ బాగా షేర్ చేయబడింది. అంటే సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు,ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదన్నమాట.

సీఏఏ ఆందోళనలు కొనసాగుతున్నప్పటి నుంచి ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఎప్పడో గతంలో వీడియోలు తీసుకొచ్చి సీఏఏకు లింక్ చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇటీవల తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఇలాంటి పాత వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే దానిపై విమర్శలు వ్యక్తమవడంతో ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.