పాత 100 రూపాయల నోట్లు రద్దు? ఇందులో నిజమెంత..

ఆ నోట్ల 2024 మార్చి 31వ తేదీ వరకే చలామణిలో ఉంటాయని, ఆ తర్వాత ఆర్బీఐ వాటిని నిషేధిస్తుందని పుకార్లు రేగాయి. దీంతో ఆ నోట్లు కలిగి ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు.

పాత 100 రూపాయల నోట్లు రద్దు? ఇందులో నిజమెంత..

Old 100 Rupees Notes No Longer Legal Tender (Photo : Google)

Updated On : January 1, 2024 / 12:15 PM IST

Fact Check : సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని అంశాలు వైరల్ అయిపోతున్నాయి. అది నిజమో? అబద్దమో? తెలుసుకోకుండానే జనాలు వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. కొన్ని విషయాలు ఎంతలా వైరల్ అవుతున్నాయంటే.. అది నిజమే అని ఫిక్స్ అయిపోవాల్సిందే. ఆ రేంజ్ లో అవి పాకిపోతున్నాయి. ఇక, కరెన్సీ నోట్లకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ జనాల్లో తిరుగుతూనే ఉంటుంది. తాజాగా పాత వంద రూపాయల నోట్లకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. పాత రూ.100 నోట్లు ఇకపై చెల్లవని, వాటిని రద్దు చేస్తారు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఆ నోట్లు 2024 మార్చి 31వ తేదీ వరకే చలామణిలో ఉంటాయని, ఆ తర్వాత ఆర్బీఐ వాటిని నిషేధిస్తుందని, కాబట్టి ఎవరి దగ్గర అయినా పాత 100 రూ. నోట్లు ఉంటే మార్పిడి చేసుకోవాలని పుకార్లు రేగాయి. దీంతో ఆ నోట్లు కలిగి ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. ఆ నోట్లు తీసుకోవడానికి కొందరు జంకుతున్నారు. వేరే నోటు ఇవ్వాలని పట్టు పడుతున్నారు. దీంతో జనాల్లో కలకలం మొదలైంది.

పాత 100 రూపాయల నోట్లు రద్దు అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం, జనాల్లో ఆందోళన నెలకొనడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్పందించింది. దీనిపై ఆర్బీఐ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. పాత 100 రూపాయల నోట్లు రద్దు చేస్తారు, ఇక ఆ నోట్లు చెల్లవు అనే వార్తలో నిజం లేదని ఆర్బీఐ వెల్లడించింది. అది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. పాత 100 రూపాయల నోట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయబోము అని ప్రకటించింది. పాత వంద నోటును మార్పిడి చేసుకోవాలి అంటూ తాము ఎలాంటి డెడ్ లైన్ ఇవ్వలేదని ఆర్బీఐ వర్గాలు వివరించాయి.

పాత 100 రూపాయల నోట్లు రద్దు చేస్తారు అంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్బీఐ కోరింది. ఎలాంటి అనుమానాలు, సందేహాలు, అపోహలు, భయాలు పెట్టుకోకుండా ఆ నోట్లను స్వీకరించవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. పాత, కొత్త వంద రూపాయల నోట్లు అన్నీ చెల్లుతాయని, చలామణిలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.