జనవరి 22 నుంచి చలామణిలోకి కొత్త 500 నోట్లు? గాంధీ స్థానంలో రాముడు? ఇందులో నిజమెంత

ఓవైపు రాముడు, మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా, స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ల జోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణం ఉంది.

జనవరి 22 నుంచి చలామణిలోకి కొత్త 500 నోట్లు? గాంధీ స్థానంలో రాముడు? ఇందులో నిజమెంత

500 Rupees Note With Lord Ram Pic

సోషల్ మీడియా పుణ్యమా అని గందరగోళం బాగా పెరిగింది. ఏది నిజం? ఏది అబద్దం? అని తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ లు, అసత్య ప్రచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అందరిలోనూ గందరగోళం నెలకొంది. ఆ వార్త నిజమో కాదో తెలుసుకోకుండానే కొందరు గుడ్డిగా వాటిని షేర్ చేస్తున్నారు, ఇతరులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అది నిజమేనేమో అని నమ్మేసి కంగారుపడుతున్నారు.

తాజాగా అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. మార్కెట్ లోకి కొత్త 500 రూపాయల నోట్లు రానున్నాయట. ఆ కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ బొమ్మ స్థానంలో రాముడు, అయోధ్య రామాలయం చిత్రాలు ఉంటాయట. ఇప్పుడీ న్యూస్ తెగ వైరల్ గా మారింది.

Also Read : 500 రూపాయ‌ల నోట్ల పై న‌క్ష‌త్రం గుర్తు.. అవి న‌కిలీవా..? నిజ‌మెంత‌..?

వివరాల్లోకి వెళితే.. రూ.500 నోటుపై మహాత్మా గాంధీ బొమ్మ స్థానంలో రాముడు, అయోధ్య ఆలయం ఉన్న ఫొటోలతో ముద్రించనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జనవరి 22న రాముడి చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటు చలామణిలోకి రానుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఒక ఫోటో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది నిజమేనేమో అని చాలా మంది నమ్మేశారు.

Also Read : అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు ఇచ్చాడా? ఇందులో నిజమెంత?

దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ PIB ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇందులో నిజం లేదని తేల్చి చెప్పింది. అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. రాముడి చిత్రంతో 500 రూపాయల నోట్లు ముద్రించలేదని వెల్లడించింది. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ ఫోటో మార్ఫింగ్ చేసిందని వివరణ ఇచ్చింది. ఒరిజినల్ రూ.500 నోటును మార్ఫింగ్ చేశారని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.

Also Read : అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా?

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ నోటు లాంటి ఫోటోను ఓసారి గమనిస్తూ.. దానిపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం స్థానంలో శ్రీరాముడి చిత్రం ఉంటుంది. ఓవైపు రాముడు, మరోవైపు ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయ నమూనా, స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ల జోడు ఉండే ప్రదేశంలో రాముడి బాణం ఉంది.